Aadhaar and Bank Account Link : మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో తెలియదా? చెక్ చేసుకోండిలా
మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో తెలియదా | ఆధార్ నెంబర్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్క భారత పౌరుడికి చాలా ముఖ్యమైనది. ఆధార్ కార్డు లేకుంటే ఏం చేయలేం
ఆధార్ నెంబర్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్క భారత పౌరుడికి చాలా ముఖ్యమైనది. ఆధార్ కార్డు లేకుంటే ఏం చేయలేం. పాస్ పోర్ట్ లేకున్నా ఏం కాదు కానీ.. ఆధార్ కార్డు లేకుంటే.. ఏ పనీ కాదు. చివరకు సిమ్ కార్డు కూడా తీసుకోలేం. ప్రభుత్వ పథకాలు రావాలన్నా.. చివరకు బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలన్నా కూడా ఆధార్ కార్డు ఉండాల్సిందే.

అయితే.. చాలామందికి తమ ఆధార్ కార్డు నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో తెలియదు. ఎందుకంటే.. ఏవైనా ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే డబ్బులు.. ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన అకౌంట్లోనే జమ అవుతుంటాయి. అందుకే.. చాలామంది.. తమ ఆధార్ నెంబర్.. ఏ అకౌంట్‌తో లింక్ అయి ఉందో తెలుసుకోవాలని అనుకుంటారు కానీ.. ఎలా తెలుసుకోవాలో తెలియదు. అటువంటి వాళ్లు ఈ స్టెప్స్ ఫాలో అయితే.. తమ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో ఈజీగా తెలుసుకోవచ్చు.

దాని కోసం ముందుగా https://uidai.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లండి. అది ఆధార్ కార్డులను జారీ చేసే యూఐడీఏఐ వెబ్సైట్. దాన్ని ఓపెన్ చేశాక.. Aadhaar Services అనే ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడే మరో పేజి ఓపెన్ అవుతుంది.

అక్కడ Aadhaar Linking Status అనే ఆప్షన్ ఉంటుంది. దాని కింద Check Aadhaar/Bank Linking Status అనే లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మరో పేజి ఓపెన్ అవుతుంది.

అక్కడ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేసి.. సెక్యూరిటీ కోడ్ టైప్ చేసి.. సెండ్ ఓటీపీ అనే బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేయగానే.. ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని వెరిఫై చేయగానే.. ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. బ్యాంక్ లింక్ స్టేటస్, లింక్ అయిన తేదీ.. అన్నీ అక్కడ కనిపిస్తాయి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులు లింక్ అయినా అన్ని బ్యాంకుల వివరాలు అక్కడ ఉంటాయి.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

