Junk Mails : జంక్ మెయిల్స్ ఇబ్బంది పెడుతున్నాయా? అవసరం లేని మెయిల్స్‌ను ఒకేసారి ఇలా డిలీట్ చేసేయండి
జంక్ మెయిల్స్ ఇబ్బంది పెడుతున్నాయా? | అవసరం లేని మెయిల్స్‌ను ఒకేసారి ఇలా డిలీట్ చేసేయండి
జీమెయిల్‌ను ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడుతున్నారు. ఇదివరకు అంటే.. యాహూ మెయిల్ ఉండేది. ఔట్లుక్, హాట్ మెయిల్, రెడిఫ్ మెయిల్స్ ఉండేవి. అవన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ.. వాటిని ఎక్కువగా ఎవ్వరూ మెయిల్స్ కోసం ఉపయోగించుకోవడం లేదు. ఎవ్వరైనా ఇప్పుడు వాడేది జీమెయిలే. చాలా అప్లికేషన్లకు లాగిన్ అవ్వాలంటే జీమెయిల్‌ను అడుగుతున్నాయి. చివరకు యూట్యూబ్ ఓపెన్ చేసి.. ఏదైనా చానెల్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకోవాలన్నా మెయిల్‌కు లాగిన్ అవ్వాల్సిందే. ఫేస్బుక్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నా మెయిల్ ఐడీ కావాల్సిందే.

జీమెయిల్లో ఉండే ఫీచర్లు కూడా ఎక్కువే. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోగానే ప్రతి యూజర్‌కు 15 జీబీ ఫ్రీ స్పేస్‌ను గూగుల్ అందిస్తుంది. 15 జీబీ స్టోరేజ్ దాటితే ప్రీమియం వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే.. చాలామంది జీమెయిల్ అకౌంట్.. అవసరం లేని.. పనికిమాలిన మెయిల్స్, ప్రమోషనల్, సోషల్, జంక్, స్పామ్ మెయిల్స్‌తో నిండిపోయి ఉంటుంది. అటువంటి మెయిల్స్ వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు కానీ.. వాటి వల్ల స్టోరేజ్ మొత్తం నిండిపోతుంది. దీంతో ప్రీమియం స్టోరేజ్ కోసం పే చేయాల్సి ఉంటుంది.

అందుకే.. జీమెయిల్ అకౌంట్లో ఉన్న అవసరం లేని మెయిల్స్‌ను డిలీట్ చేసుకుంటే కావాల్సినంత స్టోరేజ్ ఉంటుంది. అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. కానీ.. అవసరం లేని మెయిల్స్‌ను ఎలా చెక్ చేయాలి. జంక్ మెయిల్స్‌ను ఒక్కొక్కటి చూసి.. డిలీట్ చేయడమంటే చాలా సమయం తీసుకుంటుంది.
అలా కాకుండా.. Inbox by Google అనే అప్లికేషన్ ద్వారా ఈమెయిల్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే చాలు.. అవసరం లేని అన్ని జంక్ మెయిల్స్‌ను ఒకే ఒక్క క్లిక్‌తో డిలీట్ చేయొచ్చు.
ఆ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నాక.. దాన్ని ఓపెన్ చేస్తే.. జీమెయిల్లోని మెయిల్స్ అన్నీ సింక్ అవుతాయి. మెయిల్స్ అన్నీ క్యాటగిరీల వారీగా సపరేట్ అవుతాయి. అన్‌రీడ్, ప్రియారిటీ, అప్డేట్స్, ఫోరమ్స్, పర్చేజెస్, ప్రమోషన్.. ఇలా క్యాటగిరీల వారీగా సపరేట్ అయిన మెయిల్స్‌లో అవసరం లేని క్యాటగిరీలోని మెయిల్స్‌ను డిలీట్ చేసుకోవచ్చు లేదా అర్కైవ్ చేసుకోవచ్చు. దీని ద్వారా అవసరం లేని మెయిల్స్ అన్నీ డిలీడ్ అయిపోతాయి. స్పేస్ కూడా ఫ్రీ అవుతుంది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
Flying Cars : 2024 నాటికి అందుబాటులోకి ఫ్లయింగ్ కార్లు
New App : దగ్గితే చాలు.. వ్యాధేంటో ఈ యాప్ చెప్తుంది!
Space X | చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్.. 3 రోజులపాటు నలుగురు సాధారణ వ్యక్తులు స్పేస్‌లోకి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

