Twitter | ఐఫోన్‌ను అన్‌లాక్ చేసిన హ్యాకర్‌కు ట్విట్టర్లో 12 వారాల ఇంటర్న్‌షిప్
ట్విట్టర్ సెర్చ్ ఫీచర్లో పనిచేయనున్న జార్జ్ హాట్జ్
Twitter : అమెరికాకు చెందిన హ్యాకర్‌కు ట్విట్టర్ కంపెనీ 12 వారాల ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించింది. న్యూజెర్సీలో ఉండే జార్జ్ హాట్జ్ ఒక సెక్యూరిటీ హ్యాకర్. ఇతను 2007లో ఐ ఫోన్‌ను అన్‌లాక్ చేశాడు. ఈమధ్యే ఇతను తనకు ట్విట్టర్లో పనిచేయాలని ఉందని చెప్పాడు. ఎలన్ మస్క్ కూడా ఎప్పటి నుంచో జార్జ్ సేవల్నిఉపయోగించుకోవాలి అనుకుంటున్నాడు. దాంతో, అతనికి ట్విట్టర్లో 12 వారాలు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం దక్కింది. తాను ట్విట్టర్ సెర్చ్ ఫీచర్లో పనిచేయనున్నట్టు జార్జ్ మంగళవారం తెలిపాడు. గతంలో జార్జ్ టెస్లాకు పోటీగా ఆటో పైలెట్ ఫీచర్‌ను డెవలప్ చేశాడు. ఈ ఫీచర్ టెస్లా ఆటో పైలెట్ ఫీచర్ కంటే ఉత్తమంగా పనిచేస్తుందనే వార్తల్ని టెస్లా కొట్టిపారేసింది. కానీ, జార్జ్ రూపొందించిన ఆటోపైలెట్ ఫీచర్ విజయవంతమైంది.
జార్జ్ హ్యాకర్ మాత్రమే కాదు ఎంటర్ప్రెన్యూర్ కూడా. ఇతను Comma.ai అనే డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టం స్టార్టప్‌ను తయారుచేశాడు. దీని సాయంతో ఇతర కంపెనీ కార్లలోనూ టెస్లా కార్లలో ఉన్న ఆటోపైలెట్ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దాంతో, 2015లో హట్జ్ను టెస్లాలోకి ఆహ్వానించేందుకు మస్క్ ప్రయత్నించాడు. కానీ హట్జ్ ఆసక్తి చూపించలేదు.
మస్క్ ట్విట్టర్‌ని హస్తగతం చేసుకున్న తర్వాత భారీగా ఉద్యోగులను తొలగించాడు. ఇంతకుముందు ట్విట్టర్లో 7,500 మంది పనిచేస్తుండగా ప్రస్తుతం 2,300 మంది మాత్రమే ఉన్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

