Google Pixel Watch | గూగుల్ ఇప్పటికే స్మార్ట్ఫోన్లను కూడా తయారు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా స్మార్ట్‌వాచ్‌ల తయారీపై కూడా గూగుల్ ఫోకస్ పెట్టింది. గూగుల్ నుంచి తొలి పిక్సెల్ స్మార్ట్‌వాచ్ త్వరలో లాంచ్ కాబోతోంది.
గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌వాచ్ మే 26, 2022న రిలీజ్ కానున్నట్టు టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే.. స్మార్ట్‌వాచ్ లాంచ్‌పై గూగుల్ అయితే అధికారికంగా ప్రకటించలేదు. కానీ.. ఆన్లైన్లో మే 26న గూగుల్ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేయబోతున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి.
మే 26నే ఎందుకు ఊహిస్తున్నారంటే.. ఆరోజు గూగుల్ ఇన్పుట్ అవుట్‌పుట్ డెవలపర్ కాన్ఫరెన్స్ ఉంది. ఆ కాన్ఫరెన్స్‌లో గూగుల్.. పలు హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్స్‌ను అనౌన్స్ చేయనుంది. ఆ కాన్ఫరెన్స్‌లోనే స్మార్ట్‌వాచ్‌ను కూడా లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
ఈ స్మార్ట్‌వాచ్‌లో సరికొత్త ఫీచర్లను గూగుల్ తీసుకురానుంది. గూగుల్ నుంచి ఇదివరకే వియర్ ఓఎస్ వాచ్‌లు వచ్చినప్పటికీ.. అవి పూర్తిస్థాయిలో గూగుల్ తయారు చేసినవి కావు. కానీ.. తొలిసారి గూగుల్ నుంచి వస్తున్న ప్రొడక్ట్ పిక్సెల్ వాచ్. అందుకే వియర్ ఓఎస్ వాచ్‌లో లేని ఫీచర్లను గూగుల్ ఈ వాచ్‌లో అందించనుంది. దాంట్లో ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ గూగుల్ అసిస్టెంట్ మెయిన్ ఫీచర్‌గా ఉండబోతోంది. అలాగే.. ఎక్సినోస్ ఆధారిత టెన్సర్ చిప్, ఫిట్నెస్ ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటర్, స్టెప్స్ కౌంటింగ్, ఫిట్‌బిట్ ఇంటిగ్రేషన్ లాంటి ఫీచర్లు పిక్సెల్ స్మార్ట్‌వాచ్‌లో ఉండబోతున్నాయి. నిజానికి పిక్సెల్ 6 స్మార్ట్‌ఫోన్‌తోనే స్మార్ట్‌వాచ్‌ను కూడా లాంచ్ చేయాలని గూగుల్ భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల పిక్సెల్ స్మార్ట్‌వాచ్ లాంచ్ వాయిదా పడింది. పిక్సెల్ 6 స్మార్ట్‌ఫోన్‌ను గూగుల్ జనవరి 31న లాంచ్ చేయనుంది.