న్యూఢిల్లీ : మే 10న గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a) లాంఛ్ కానుండగా అధికారిక లాంఛ్‌కు ముందు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్ మరోసారి లీకయ్యాయి. 91మొబైల్స్ రిపోర్ట్ ప్రకారం పిక్సెల్ 7ఏ ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్‌తో 6.1 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
12.2 ఎంపీ కెమెరా స్ధానంలో నయూ 64ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సర్‌తో కెమెరా సిస్టమ్‌ను గూగుల్ అప్‌గ్రేడ్ చేయనుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ గూగుల్ న్యూ టెన్సర్ జీ2 ఎస్ఓసీ చిప్సెట్తో 20డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్‌తో 4400ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ముందుకురానుంది. ఇక సాఫ్ట్వేర్ విషయంలో పిక్సెల్ 7ఏ ఆండ్రాయిడ్ 13 అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్‌పై రన్ అవుతుంది.
ఇక పిక్సెల్ 7ఏ డిజైన్ విషయంలో పెద్దగా మార్పు చేర్పులుండవని చెబుతున్నారు. గూగుల్ పిక్సెల్ 7ఏ గూగుల్ ఐఓ ఈవెంట్ వేదికగా మే 10న లాంఛ్ కానుంది. పిక్సెల్ 7 సిరీస్‌పై గూగుల్ భారీ ప్రకటనలు ఇస్తున్న క్రమంలో ఈ హాట్ డివైజ్‌ను భారత్‌లో ఎంట్రీ ఇచ్చేలా కంపెనీ కసరత్తు సాగిస్తోంది. ఇక గూగుల్ పిక్సెల్ 7ఏ భారత్‌లో రూ. 40,000 నుంచి రూ. 45,000 మధ్య అందుబాటులో ఉంటంది.
Read More