న్యూఢిల్లీ : యాపిల్ డేస్ సేల్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ ఐఫోన్లపై పలు ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. బ్యాంక్ ఆఫర్లతో పాటు ఐఫోన్ 13, ఐఫోన్ 12 వంటి పాత ఐఫోన్లపైనా తాత్కాలికంగా ధరల తగ్గింపుతో ఈకామర్స్ దిగ్గజం కస్టమర్ల ముందుకొచ్చింది. న్యూ ఐఫోన్ 14పై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్‌తో ఐఫోన్ 14 రూ. 79,900 నుంచి రూ .74,900కు తగ్గింది.
యాపిల్ డేస్ సేల్ నవంబర్ 20 వరకూ ఫ్లిప్‌కార్ట్‌పై కొనసాగనుంది. ఇక ఐఫోన్ 13 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ 69,900 కాగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ . 64,999కి అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ డీల్స్ ద్వారా కస్టమర్లు మరో రూ 17,500 వరకూ తగ్గింపును పొందే వెసులుబాటు ఉంది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుదారులు రూ . 1500 అదనపు డిస్కౌంట్‌ను పొందే వీలుంది.
ఐఫోన్ 14 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌పై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యూజర్లు రూ. 5000 ఆఫర్ పొందనున్నారు. ఇక ఐఫోన్ 12 కొనుగోలుదారులకు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ 128జీబీ మోడల్ ప్రస్తుత ఎంఆర్పీ రూ 64,900 కాగా
రూ.55,999కే లభిస్తోంది. ఫడరల్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు అదనంగా మరో రూ 1500 ఇన్స్టంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.