న్యూఢిల్లీ : దేశీ స్మార్ట్‌వాచ్ బ్రాండ్ ఫైర్ బోల్ట్ స్టార్‌డస్ట్, డాగర్ పేరుతో రెండు లేటెస్ట్ స్మార్ట్‌వాచ్‌లను లాంఛ్ చేసింది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్‌వాచ్‌లు కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్, వెదర్ అప్డేట్, బ్రీత్ ట్రైనింగ్, మోడ్ ఫీచర్లు, హెల్త్ ఫీచర్లతో కస్టమర్ల ముందుకొచ్చాయి. రెండు వాచ్‌లు వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 68 సర్టిఫికేషన్ పొందాయి.
స్టార్‌డస్ట్, డాగర్ స్మార్ట్‌వాచ్‌లు వరుసగా రూ. 2499, రూ . 3499కి కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ఫైర్ బోల్ట్ డాగర్ బ్లాక్, గ్రే, గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుండగా, ఫైర్ బోల్ట్ స్టార్ డస్ట్ రోజ్ గోల్డ్, గ్రే, బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఫైర్ బోల్ట్ స్టార్‌డస్ట్‌ను కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేసే వెసులుబాటు ఉండగా డాగర్ అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్సైట్ ఫైర్‌బోల్ట్.కాం నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఫైర్ బోల్ట్ స్టార్‌డస్ట్ 1.95 ఇంచ్ లార్జ్ రెక్టాంగులర్ డిస్ప్లేతో ట్రూ హెచ్డీ డిస్ప్లేను ఆఫర్ చేస్తోంది. ఫుల్ మెటాలిక్ బాడీ, మెటల్ కేస్‌తో పాటు బ్లూటూత్ కాలింగ్‌ను సపోర్ట్ చేసే స్పీకర్‌తో స్టార్‌డస్ట్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. రెండు గంటల చార్జింగ్‌తో ఈ వాచ్ ఐదు రోజుల పాటు పనిచేస్తుందని ఫైర్ బోల్ట్ పేర్కొంది. ఫైర్ బోల్ట్ డాగర్ 1.43 ఇంచ్ ఆల్వేస్ ఆన్ అమోల్డ్ డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్, క్విక్ డయల్ పాడ్, సింక్ కాంటాక్ట్స్ వంటి ఫీచర్లతో కస్టమర్ల ముందుకొచ్చింది.