Be Alert on ChatGPT | బీ అలర్ట్.. గూగుల్.. ఆపిల్ స్టోర్స్‌లో ఫేక్ చాట్ జీపీటీ యాప్స్ పాపులర్.. !
ChatGPT | అనతికాలంలోనే పాపులరైన చాట్‌జీపీటీని సొమ్ము చేసుకునేందుకు కొందరు డెవలపర్లు ఫేక్ యాప్‌లు తెచ్చారు.
Be Alert on ChatGPT | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపుదిద్దుకున్న చాట్‌బోట్ `చాట్‌జీపీటీ`.. గతేడాది నవంబర్‌లో ప్రారంభమైంది. రెండు నెలల్లోనే అత్యంత వేగంగా పాపులారిటీ సంపాదించుకున్నది. గూగుల్ సెర్చింజన్`లో ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చినట్లే.. చాట్‌బోట్ `చాట్‌జీపీటీ`లో చాట్ రోబో మనిషి తరహాలోనే స్పందిస్తూ నమ్మశక్యం గానీ శక్తి సామర్థ్యాలను ప్రదరిస్తూ ప్రజాదరణ పొందింది. ఇప్పటికైతే `చాట్‌జీపీటీ` పేరెంట్ సంస్థ `ఓపెన్ ఏఐ`.. ఉచితంగా యూజర్లకు సేవలందిస్తున్నది.
ఈ చాట్‌బోట్‌కు లభించిన పాపులిరిటీని కొందరు డెవలపర్లు సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. చాట్ జీపీటీకి ఫేక్ వర్షన్ల యాప్‌లు సృష్టించారు.. అంతటితో ఆగలేదు.. ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌ల్లో కూడా పెట్టేశారు. ఈ యాప్‌లు వాడినందుకు యూజర్లపై చార్జీలు విధిస్తూ.. మోసం చేస్తున్నారు. అంతే కాదు వీటిల్లో కొన్ని ఫేక్ యాప్స్.. ఫేక్ పాజిటివ్ రివ్యూస్ కూడా పొందడంతోపాటు పాపులర్ యాప్స్ ర్యాంక్ కూడా కొట్టేశాయి.
`చాట్‌జీపీటీ` ఫేక్ వర్షన్‌ను గుర్గించిన ఆపిల్.. తన యాప్ స్టోర్ నుంచి సదరు ఫేక్ చాట్‌జీపీటీ యాప్‌ను తొలగించేసింది. అంతకుముందు సదరు యాప్‌కు `చాట్ జీపీటీ ఏఐ విత్ జీపీటీ-3` అనే పేరు పెట్టి ఆన్లైన్లో వదిలారు. దీనికి వేల డౌన్లోడ్లు వచ్చాయి. పాజిటివ్ రివ్యూలు కూడా అందుకున్నది. యాడ్-ఫ్రీ యూసేజ్‌కి 49.99 డాలర్ల ఫీజును యాప్ డెవలపర్ చార్జి చేసినట్లు తెలుస్తున్నది. గూగుల్ ప్లే స్టోర్‌లో `చాట్‌జీపీటీ` గురించి సెర్చింగ్ చేసే వారికి పలు అప్లికేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అవన్నీ టాప్ ర్యాంకింగ్‌లో ఉండటం గమనార్హం.
చాట్ జీపీటీ ఎవరైనా ఫ్రీడా వాడుకోవచ్చు. ఇప్పటి వరకు ఓపెన్ ఏఐ అధికారిక మొబైల్ యాప్ విడుదల చేయలేదు. యాప్ మీద చాట్‌బోట్ సాంకేతికంగా అందుబాటులోకి రాదు. chat.openai.com వెబ్‌సైట్‌పై నేరుగా చాట్ జీపీటీతో చాట్‌బోట్ జరుపవచ్చు. ఒకవేళ మీకు గూగుల్ ప్లే స్టోర్‌లో గానీ, ఆపిల్ యాప్ స్టోర్‌లో గానీ.. ఫేక్ `చాట్‌జీపీటీ` యాప్ కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని గూగుల్, ఆపిల్ కోరుతున్నాయి. ఈ ఫేక్ యాప్స్ మీ డేటా తస్కరించడం గానీ, మీ వద్ద మనీ చార్జీ చేయడం గానీ చేస్తాయని హెచ్చరించాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

