Wordle | ఈ గేమ్ పేరు విన్నారా అసలు. ఈ గేమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ గేమ్ గురించే ఎక్కువగా చర్చిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ గేమ్ ఆడటం చాలా సింపుల్. ప్రస్తుతం నెటిజన్లు ఈ గేమ్‌తోనే టైమ్ పాస్ చేస్తున్నారు.
ఇంతకీ దీన్ని ఎలా ఆడాలంటే.. దీని కోసం ముందు https://www.powerlanguage.co.uk/wordle/ ఈ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఆరు బ్లాక్స్ ఉంటాయి. ఒక్కో బ్లాక్‌లో ఐదు లెటర్స్ ఉండే ఒక ఇంగ్లీష్ వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజు కొత్త వర్డ్ ఉంటుంది. ఆ ఐదు లెటర్ల సీక్రెట్ వర్డ్ ఏంటనేది మీరు గుర్తించాల్సి ఉంటుంది. దాని కోసం ముందు ఏదో ఒక ఐదు లెటర్ల వర్డ్‌ను ఎంటర్ చేస్తే.. ఆ సీక్రెట్ వర్డ్‌లో ఉన్న లెటర్స్ దాంట్లో ఏవైనా ఉంటే వెంటనే గ్రీన్ కలర్ చూపిస్తుంది.
ఒకవేళ ఆ లెటర్స్ ఉండి సరైన ప్లేస్‌లో కాకుండా రాంగ్ ప్లేస్‌లో ఉంటే ఎల్లో కలర్ చూపిస్తుంది. అసలు ఆ లెటర్స్.. సీక్రెట్ వర్డ్‌లో లేకపోతే గ్రే కలర్ చూపిస్తుంది. 6 సార్లు ఆ సీక్రెట్ వర్డ్‌ను ఎంటర్ చేసే చాన్స్ ఉంటుంది. ఆరు సార్లు ఫెయిల్ అయితే.. ఆ సీక్రెట్ వర్డ్ ఏదో స్క్రీన్ మీద చూపిస్తుంది. ఒక్కసారి ఫెయిల్ అయ్యాక వెంటనే గేమ్ ఆడటానికి అవకాశం ఉండదు. మళ్లీ 4 గంటల తర్వాత కొత్త సీక్రెట్ వర్డ్‌తో గేమ్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ గేమ్‌కు యాప్ లేదు. వెబ్సైట్లోనే ఈ గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ మెదడుకు పదును పెట్టండి.