Drones : డ్రోన్లకు బ్రెయిన్.. సైంటిస్టుల సరికొత్త ప్రయోగం.. దేనికోసం వాడనున్నారంటే?
ఇది టెక్నాలజీ యుగం. ఈ జనరేషన్లో ఏం చేయాలన్నా టెక్నాలజీతోనే. రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే మనుషుల్లా ప్రవర్తించే రోబోలు వచ్చేశాయి. మనుషుల కంటే కూడా ఎంతో తెలివైన రోబోలను ఇప్పటికే పలు దేశాల్లో తయారు చేశారు. రోబో సినిమాలో చూసినట్టుగా.. మనిషి చేయలేని ఎన్నో పనులను రోబోలు చేస్తున్నాయి. అయితే.. టెక్నాలజీని అవసరానికి, మంచికి వాడుకుంటే మనుషులకు వచ్చే సమస్య ఏం ఉండదు. అందుకే.. చెక్ దేశానికి చెందిన సైంటిస్టులు.. డ్రోన్లలో ఎక్స్ ట్రా ఫీచర్స్ యాడ్ చేశారు.

సాధారణంగా డ్రోన్ల వల్ల మ్యాన్ పవర్ అవసరం ఉండదు. వంద మంది చేసే పనిని ఒక్క డ్రోన్‌తో చేయించవచ్చు. అయితే.. డ్రోన్ అనేది కూడా ఒక పరికరమే. అది మనిషి ఏది చెబితే అది చేస్తూ పోతుంది. అలా కాకుండా డ్రోన్లు పరిస్థితులను బట్టి ప్రవర్తించేలా చేయడం కోసం వాటంతట అవే ఆలోచించి నిర్ణయం తీసుకునేలా వాటికి బ్రెయిన్‌ను అమర్చారు. మనిషి బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో.. అలాగే సేమ్ టు సేమ్ డ్రోన్లు ఆలోచనా శక్తిని కలిగి ఉండేలా రూపొందించారు.
చెక్ రిపబ్లిక్‌లోని బీఆర్ఎన్వో యూనివర్సిటీ, చెక్ రిపబ్లిక్ పోలీసులు సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్‌ను డెవలప్ చేశారు. ఇది న్యూరల్ నెట్‌వర్క్స్‌ను ఉపయోగించి డేటాను డీకోడ్ చేస్తుంది. బ్రెయిన్‌ను డెవలప్ చేసిన డ్రోన్లను నిఘా కోసం, ట్రాఫిక్ మేనేజ్ మెంట్ కోసం, క్రౌడ్ కంట్రోల్ కోసం ఉపయోగించనున్నారు.
తాజాగా బ్రెయిన్ సిస్టమ్‌తో డెవలప్ చేసిన ఈ డ్రోన్లను టెస్ట్ చేయగా.. ఖచ్చితమైన రిజల్ట్స్ వచ్చినట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఫుట్ బాట్ స్టేడియంలో పిచ్‌ను గమనిస్తూ.. అక్కడ ఏదైనా నియమాలకు విరుద్ధంగా జరిగితే.. వెంటనే రిపోర్ట్ చేయాలంటూ డ్రోన్లను స్టేడియం మీద ఎగురవేశారు. ఆ తర్వాత ఆ స్టేడియంలోకి ప్లేయర్స్‌ను పంపించి.. వాళ్లతో గేమ్ ఆడించారు. మ్యాచ్ మధ్యలో.. కొందరు ప్లేయర్స్‌ను గ్రౌండ్లో పడుకోవాలని సూచించారు. వెంటనే ప్లేయర్స్ కింద పడుకోగానే.. అక్కడ పరిస్థితి ఏదో తేడాగా ఉందని వెంటనే ఆ డ్రోన్ సిస్టమ్ రిపోర్ట్ పంపించింది.
ఇంకా కొన్ని టెస్టులు చేసి.. కరెంట్ సిచ్యుయేషన్‌ను డ్రోన్ అంచనా వేసే పద్ధతిపై ఒక నిర్ణయానికి వచ్చాక.. ఆ సిస్టమ్స్‌ను చెక్ పోలీసులు కూడా వాడనున్నారు. ట్రాఫిక్ మేనేజ్ మెంట్‌తో పాటు.. పోలీసింగ్ వ్యవస్థ కోసం కూడా ఆ డ్రోన్స్‌ను వినియోగించనున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

