ChatGPT | చాట్‌జీపీటీ సాయంతో ఏడాది లోపు 100 బుక్స్ రాసిన రచయిత
పుస్తకం రాయాలనే కోరక ఉన్నా సమయం లేదని బాధపడే వారికి ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT) అద్భుత అవకాశంగా ముందుకొచ్చింది.
న్యూఢిల్లీ : పుస్తకం రాయాలనే కోరక ఉన్నా సమయం లేదని బాధపడే వారికి ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT) అద్భుత అవకాశంగా ముందుకొచ్చింది. ఓ రచయిత చాట్‌జీపీటీ వాడుతూ ఏడాది లోపే ఏకంగా 100 పుస్తకాలను రాసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏఐ టూల్‌ను ఉపయోగిస్తూ రచయిత ఇన్ని పుస్తకాలు రాయడంతో పాటు ఈ క్రమంలో మంచి రాబడినీ పొందాడు.
చాట్‌జీపీటీ, క్లాడ్ వంటి ఏఐ టూల్స్ సాయంతో టిమ్ బౌచర్ ఏకంగా 100 ఎగ్జైటింగ్ ఈబుక్స్‌ను తీసుకువచ్చాడని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఈ బుక్స్‌ను బౌచర్ ఏఐ లోర్ సిరీస్‌గా పిలుస్తాడు. మానవ సృజనాత్మకతకు ఈ ఏఐ టూల్స్ పదును పెడతాయని బౌచర్ నమ్ముతున్నాడు. ఏఐ సామర్ధ్యాల గురించి చెబుతూ తన స్టోరీలను ప్రజల ముందుంచే క్రమంలో ఏఐ చాట్‌బాట్స్, ఇమేజ్ జనరేటర్స్‌ను వాడినట్టు వెల్లడించాడు. ఏఐ చాట్‌బాట్స్ సాయంతో బౌచర్ మెరుగైన ఆలోచనలతో టెక్ట్స్‌ను రూపొందిచడంతో పాటు అందమైన ఇలస్ట్రేషన్స్కు రెక్కలు తొడిగాడు.
బౌచర్ బుక్స్ 5000 పదాలతో పాటు కొన్ని డజన్ల ఏఐ జనరేటెడ్ ఇమేజెస్‌తో కస్టమర్ల ముందుకొచ్చాయి. సంప్రదాయ రచయితల మాదిరి రాయడంపై నెలల తరబడి గడపకుండా, బౌచర్ కేవలం కొద్ది గంటల్లోనే బుక్‌ను రాయడం పూర్తిచేస్తాడు. ఈ ఏడాది ఆగస్ట్, మే మధ్య బౌచర్ తన స్టోరీలకు సంబంధించి 500కుపైగా కాపీలను విక్రయించాడు. ఈ క్రమంలో బౌచర్ దాదాపు 2000 డాలర్లు ఆర్జించాడు. ఈ బుక్స్ అన్నీ సిరీస్‌లో భాగంగా రావడంతో ఒక్కో పాఠకుడు పదేసి బుక్స్‌ను ఒకేసారి కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపడం కూడా రచయితకు కలిసివచ్చింది.
Read More
campus hiring | ఐటీ కంపెనీల క్యాంపస్ హైరింగ్‌లో 40 శాతం కోత
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

