campus hiring | ఐటీ కంపెనీల క్యాంపస్ హైరింగ్‌లో 40 శాతం కోత
భారత ఐటీ కంపెనీలు క్యాంపస్ హైరింగ్‌ను ఏకంగా 40 శాతం తగ్గించాయి. ఆర్ధిక మందగమనం వెంటాడటంతో ఖర్చులు తగ్గించుకునేందుకు టెక్ దిగ్గజాలు మాస్ లేఆఫ్స్‌కు తెగబడుతుండగా క్యాంపస్ హైరింగ్ (campus hiring) పైనా ఆ ప్రభావం కనిపిస్తోంది.
న్యూఢిల్లీ : భారత ఐటీ కంపెనీలు క్యాంపస్ హైరింగ్‌ను ఏకంగా 40 శాతం తగ్గించాయి. ఆర్ధిక మందగమనం వెంటాడటంతో ఖర్చులు తగ్గించుకునేందుకు టెక్ దిగ్గజాలు మాస్ లేఆఫ్స్‌కు తెగబడుతుండగా క్యాంపస్ హైరింగ్ (campus hiring) పైనా ఆ ప్రభావం కనిపిస్తోంది. లేఆఫ్స్‌తో పాటు ఐటీలో నెలకొన్న స్ధబ్ధత కారణంగా 2024లో క్యాంపస్ హైరింగ్ మందకొడిగా ఉంటుందని రిక్రూట్మెంట్ కంపెనీ టీమ్‌లీజ్ డిజిటల్ పేర్కొంది.
2023లో ఐటీ కంపెనీలు 2,30,000 మందిని క్యాంపస్‌ల నుంచి రిక్రూట్ చేసుకోగా, ఈ ఏడాది ఆ సంఖ్య 1,55,00కు పరిమితం కానుందని అంచనా వేసింది. తాము ఇప్పటికే అభ్యర్ధులకు ఇచ్చిన జాబ్ ఆఫర్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని, అంందుకే తాము క్యాంపస్ రిక్రూట్మెంట్కు ఈసారి వెళ్లడం లేదని విప్రో హెచ్ఆర్ చీఫ్ సౌరవ్ గోవిల్ స్పష్టం చేశారు.
గత ఏడాదితో పోలిస్తే టాలెంట్ పరిస్దితి ప్రస్తుతం భిన్నంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్ధిక అనిశ్చితి నేపధ్యంలో హైరింగ్ ప్రాధాన్యతలు మారాయని తెలిపారు. కాగా ఫ్రెషర్ల జాబ్ ఆఫర్ల వేతనాన్ని 50 శాతం కోత విధించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో విప్రో నిర్ణయించిన సమయంలో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ నిర్ణయంలో విప్రో నైతికతను పలువురు ప్రశ్నించారు.
Read More
Amazon | అమెజాన్ తీరుపై ఉద్యోగుల అసహనం : ఈనెల 31న టెకీల నిరసన
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

