Apple Watch | మహిళ ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్
యాపిల్ వాచ్ (Apple Watch) హెల్త్ ఎమర్జెన్సీపై సకాలంలో అలర్ట్ చేసి తమ ప్రాణాలను కాపాడిందని గతంలో పలువురు వాచ్ యూజర్లు వెల్లడించారు.
న్యూయార్క్ : యాపిల్ వాచ్ (Apple Watch) హెల్త్ ఎమర్జెన్సీపై సకాలంలో అలర్ట్ చేసి తమ ప్రాణాలను కాపాడిందని గతంలో పలువురు వాచ్ యూజర్లు వెల్లడించారు. యాపిల్ వాచ్ నిరంతరాయంగా యూజర్ హార్ట్ రేట్‌ను మానిటర్ చేస్తూ అసాధారణ మార్పులను గుర్తిస్తే వెంటనే యూజర్లను అప్రమత్తం చేస్తుంటుంది. తమ యాపిల్ వాచ్ హార్ట్‌బీట్‌లో తేడాలను గుర్తించి అలర్ట్ చేయడంతో తాము ప్రాణాలతో బయటపడ్డామని పలువురు కస్టమర్లు చెబుతుంటారు.
ఇక ఈ తరహా ఘటన మరొకటి వెలుగు చూసింది. యాపిల్ వాచ్ తనను ప్రాణాపాయం నుంచి కాపాడిందని 29 ఏండ్ల మహిళ వెల్లడించింది. లోకల్12 న్యూస్ కధనం ప్రకారం కిమ్మి వకిన్స్ అనే మహిళ నిద్రిస్తుండగా ఆమె హార్ట్‌రేట్ అసాధారణంగా పెరగడాన్ని యాపిల్ వాచ్ పసిగట్టింది. నిద్రలో ఆమె గుండె నిమిషానికి ఏకంగా 178 సార్లు కొట్టుకుంది. అంతకుముందు ఆమెకు మగతగా నీరసంగా అనిపించింది. దీంతో వాచ్ అలారం ఆమెను అలర్ట్ చేయడంతో కిమ్మి మేలుకుంది.
ఎక్కువసేపు తన హార్ట్‌రేట్ అసాధారణంగా పెరిగిందని తెలిపింది. పది నిమిషాల వరకూ హై హార్ట్‌రేట్ కొనసాగిందని, ఇది చాలా అధికమని కిమ్మి తెలిపింది. మహిళ వెంటనే డాక్టర్లను ఆశ్రయించగా ఆమె శరీరంలో ప్రాణాంతక బ్లడ్ క్లాట్ ఉందని, పల్మనరీ ఎంబాలిజం తలెత్తే ప్రమాదం ఉందని సిన్సినాటి కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ రిచర్డ్ బెకర్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమెకు రక్తం పలుచన చేసే బ్లడ్ థిన్నర్స్ను వైద్యులు ఇస్తుండగా మహిళ ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉంది.
Read More :
Nandan Nilekani: ఐఐటీ బాంబేకి 315 కోట్లు విరాళం ఇచ్చిన నందన్ నిలేకని
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Apple Watch
- life saving
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

