Apple | ఉద్యోగులకు యాపిల్ వార్నింగ్ : వారానికి మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాల్సిందే..!
ఆర్ధిక మందగమనం, మాంద్యం భయాలతో కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ముందుగా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం యాపిల్ (Apple) ఉద్యోగులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ : అమెజాన్, గూగుల్, ట్విట్టర్, మెటా వంటి పలు టెక్ దిగ్గజాలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తుండగా ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో అనే ఆందోళన నెలకొంది. ఆర్ధిక మందగమనం, మాంద్యం భయాలతో కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ముందుగా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం యాపిల్ (Apple) ఉద్యోగులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.
వారానికి మూడు రోజులైనా ఆఫీసు నుంచి పనిచేయని ఉద్యోగులపై వేటు తప్పదని హెచ్చరించింది. ఉద్యోగుల అటెండెన్స్‌ను ట్రాక్ చేస్తున్న యాపిల్ ఇటీవల ఉద్యోగులను హెచ్చరించినట్టు సమాచారం. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాలని, ఇలా చేయని ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. పని విధానాలను అతిక్రమించే వారిని తొలగిస్తామని కంపెనీ పేర్కొందని ప్లాట్పామర్ మేనేజింగ్ ఎడిటర్ జో షిఫర్ ట్వీట్ చేశారు.
అయితే ఇది కంపెనీ అంతటికీ వర్తించదని పేర్కొన్నారు. యాపిల్ మేనేజర్లు కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఉద్యోగులు మంగళ, బుధ, గురువారాల్లో ఆఫీసుకు రావాలని కోరినట్టు బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ ఇటీవల వెల్లడించింది. కంపెనీ ఆదేశాలను బేఖాతరు చేస్తే తమ ఉద్యోగాలు ఊడతాయని యాపిల్ ఉద్యోగులు పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇక చాలా పొజిషన్స్‌కు యాపిల్ నియామకాలను పూర్తిగా నిలిపివేసిందని, మరికొన్ని పొజిషన్స్ నియామకాలను పరిమితంగా చేపడుతోందని ఈ రిపోర్ట్ తెలిపింది.
Read More :
ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాఫ్టర్‌కు తృటిలో తప్పిన ముప్పు : కొచ్చిలో సేఫ్ ల్యాండింగ్
Lalit Jha | అమెరికాలో భారత జర్నలిస్ట్‌పై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

