Apple Mac Book Pro M5 14 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ సరికొత్త ఎం5 చిప్‌తో నూతన మాక్‌బుక్ ప్రొ ల్యాప్ టాప్‌ను రిలీజ్ చేసింది. గతేడాది ఎం4 చిప్‌తో మాక్‌బుక్ ప్రొ రిలీజ్ కాగా ఇప్పుడు దాని స్థానంలో ఎం5 చిప్ తో మాక్ బుక్ ప్రొ ను లాంచ్ చేశారు. 14 ఇంచ్ మోడల్లో ఈ మాక్‌బుక్‌ను విడుదల చేశారు. ఈ ల్యాప్ టాప్ గతేడాది వచ్చిన ఎం4 చిప్ మాక్‌బుక్ ప్రొ కన్నా 3.5 రెట్లు ఎక్కువ ఏఐ ప్రదర్శనను ఇస్తుందని, 1.6 రెట్లు ఎక్కువ వేగంతో గ్రాఫిక్స్ పనిచేస్తాయని యాపిల్ చెబుతోంది. ఎం5 చిప్ మాక్ బుక్ ప్రొలో సీపీయూ 10 కోర్లను కలిగి ఉంటుంది. కానీ గతేడాది వచ్చిన ఎం4 చిప్ కన్నా 4 రెట్లు ఎక్కువ ప్రదర్శనను ఇస్తుంది. అలాగే 10 కోర్ జీపీయూ ఉంది. మొదట్లో రిలీజ్ అయిన ఎం1 చిప్ కన్నా ఈ చిప్ 6.4 రెట్లు ఎక్కువ వేగంగా పనిచేస్తుంది. ఎం5 చిప్ మాక్‌బుక్ ప్రొ ల్యాప్ టాప్‌లో 16 కోర్ న్యూరాల్ ఇంజిన్ ఉంది. ఇది ఏఐ ఆధారిత టాస్క్‌లను అత్యంత వేగంగా పూర్తి చేస్తుందని యాపిల్ చెబుతోంది.
గతేడాది వచ్చిన 14 ఇంచ్ మాక్‌బుక్ ప్రొ కన్నా ఈ కొత్త మోడల్ ఎస్ఎస్డీ 2 రెట్లు ఎక్కువ వేగంగా పనిచేస్తుంది. ఇక యాపిల్ మాక్‌బుక్ ప్రొ 2025 ఎం5 14 ఇంచ్ మోడల్లో 14.2 ఇంచుల లిక్విడ్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 3024×1964 పిక్సల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. కనుక డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. అలాగే 120 హెడ్జ్ వరకు రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. సూర్యకాంతిలోనూ స్పష్టంగా వీక్షించేలా డిస్ప్లేకు 1600 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ను అందిస్తున్నారు. ఈ ల్యాప్ టాప్ 16జీబీ, 24జీబీ ర్యామ్ మోడల్స్‌లో డిఫాల్ట్‌గా లాంచ్ అయింది. ర్యామ్‌ను 32జీబీ వరకు పెంచుకోవచ్చు. అలాగే 512జీబీ, 1టీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ ఆప్షన్లు లభిస్తున్నాయి. స్టోరేజ్‌ను 2టీబీ, 4టీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ల్యాప్ టాప్‌లో మాక్ ఓఎస్ తహో ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది.
ఈ ల్యాప్ టాప్‌లో బ్యాక్ లిట్ మ్యాజిక్ కీబోర్డును ఏర్పాటు చేశారు. దీనికి టచ్ ఐడీ కూడా ఉంది. యాంబియంట్ లైట్ సెన్సార్‌ను సైతం ఇచ్చారు. ఫోర్స్ టచ్ ట్రాక్‌పాడ్ ను ఏర్పాటు చేశారు. వైఫై 6ఇ, బ్లూటూత్ 5.3 లభిస్తున్నాయి. 12 మెగాపిక్సల్ సెంటర్ స్టేజ్ కెమెరా ఉంది. ఇది ఫుల్ హెచ్డీ రిజల్యూషన్‌ను అందిస్తుంది. 3.5 ఎంఎం ఆడియో జాక్ సదుపాయం ఉంది. హై ఫిడెలిటీ సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ను ఇచ్చారు. డాల్బీ అట్మోస్ సదుపాయం కూడా ఉంది. ఎయిర్ పాడ్స్‌ను ఈ ల్యాప్ టాప్కు సులభంగా కనెక్ట్ చేసి ఉపయోగించవచ్చు. యూఎస్బీ టైప్ సి థండర్ బోల్ట్ 4 పోర్టులు మూడింటిని ఇచ్చారు. వీటిని చార్జింగ్ లేదా డిస్ప్లే పోర్టులకు వాడుకోవచ్చు. థండర్ బోల్ట్ 4, యూఎస్బీ 4, ఎస్డీఎక్స్సీ కార్డు స్లాట్, హెచ్డీఎంఐ 2.1 పోర్టు, మాగ్ సేఫ్ 3 పోర్టులను ఇచ్చారు. ఈ ల్యాప్ టాప్ కేవలం 1.55 కిలోల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. 72.4 వాట్ల లిథియం-పాలిమర్ బ్యాటరీని ఇచ్చారు. ఇది సాధారణ వెబ్ బ్రౌజింగ్‌కు సుమారుగా 16 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 70 వాట్ల యూఎస్బీ టైప్ సి పవర్ అడాప్టర్ లభిస్తుంది. అలాగే యూఎస్బీ టైప్ సి టు మాగ్ సేఫ్ 3 కేబుల్ కూడా వస్తుంది.
మాక్‌బుక్ ప్రొ 14 ఎం5 ల్యాప్ టాప్కు చెందిన 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,69,900గా ఉంది. అలాగే 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.1,89,900గా నిర్ణయించారు. 24జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.2,09,900గా ఉంది. ఈ మాక్ బుక్ ప్రొ ల్యాప్ టాప్‌లను యాపిల్ ఇండియా ఆన్లైన్ స్టోర్‌తోపాటు యాపిల్ ఆథరైజ్డ్ స్టోర్స్, ప్రధాన రిటెయిల్ స్టోర్స్‌లో అక్టోబర్ 22 నుంచి విక్రయించనున్నారు.