e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, November 30, 2021
Home News Android Malware : ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ చేస్తున్నారా? సైబ‌ర్ క్రిమిన‌ల్స్ టార్గెట్ మీరే.. ఎలాగంటే?

Android Malware : ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ చేస్తున్నారా? సైబ‌ర్ క్రిమిన‌ల్స్ టార్గెట్ మీరే.. ఎలాగంటే?

ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్‌లో టెక్నాల‌జీ విప‌రీతంగా పెరిగింది. దాన్ని చాలామంది చెడుప‌నుల‌కు ఉప‌యోగించుకుంటున్నారు. సైబ‌ర్ నేరాలు పెరిగాయి.. సైబ‌ర్ క్రిమిన‌ల్స్ కూడా పెరిగారు. అందుకే.. ఆన్‌లైన్ ఏం చేసినా.. చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఏమాత్రం ఏమ‌ర‌పాటుగా ఉన్నా.. అకౌంట్‌లో డ‌బ్బులు గుల్లా అయిపోతాయి.

సైబ‌ర్ నేర‌గాళ్లు ఇప్ప‌టి వ‌ర‌కు చాలామంది క‌స్ట‌మ‌ర్ల‌ను టార్గెట్ చేసుకున్నారు. క్రెడిట్ కార్డ్ హోల్డ‌ర్లు, బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న క‌స్ట‌మ‌ర్లు, పేటీఎం, గూగుల్ పే లాంటి వాలెట్స్ ఉప‌యోగిస్తున్న యూజ‌ర్లు, వాట్స‌ప్, మెయిల్స్ యూజ‌ర్లు, యాప్స్ డౌన్‌లోడ్ చేసే యూజ‌ర్ల‌ను సైబ‌ర్ నేర‌గాళ్లు టార్గెట్ చేసి యూజ‌ర్ల సెన్సిటివ్‌ డేటాను త‌స్క‌రించేవారు.

- Advertisement -

తాజాగా.. సైబ‌ర్ నేర‌గాళ్ల దృష్టి ఇన్‌క‌మ్ టాక్స్ ఫైల్ చేసే వాళ్ల మీద‌కి మ‌ళ్లింది. ఇన్‌క‌మ్ టాక్స్ రిఫండ్స్ జ‌న‌రేట్ చేస్తామంటూ.. ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేసే యూజ‌ర్ల‌ను టార్గెట్ చేసుకొని.. వాళ్ల మెయిల్స్‌కు, ఫోన్ల‌కు, వాట్స‌ప్‌కు ఫిషింగ్ మెసేజ్‌ల‌ను పంపిస్తున్నారు. ఆ లింక్‌లో ఆండ్రాయిడ్ మాల్వేర్‌ను ఎంబెడ్ చేస్తున్నారు. దానిపేరు డ్రినిక్ మాల్వేర్. ఆ లింక్‌ను ఓపెన్ చేయ‌గానే.. ఫోన్‌లో డ్రినిక్ మాల్వేర్ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. దానితో పాటు ఇన్‌క‌మ్ టాక్స్ వెబ్‌సైట్‌ను పోలిన ఫిషింగ్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో ఏ స‌మాచారం ఇచ్చినా.. అవ‌న్నీ సైబ‌ర్ క్రిమిన‌ల్స్‌కు వెళ్లిపోతాయి. అలాగే.. ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యే మాల్వేర్.. ఫోన్‌లోని సున్నిత‌మైన స‌మాచారాన్ని మొత్తం సైబ‌ర్ క్రిమిన‌ల్స్ స‌ర్వ‌ర్‌లోకి పంపిస్తుంది.

భారత్‌లోని 27 బ్యాంకుల‌కు సంబంధించిన క‌స్ట‌మ‌ర్ల‌ను ప్ర‌స్తుతం సైబ‌ర్ క్రిమిన‌ల్స్ టార్గెట్ చేశార‌ని.. ఇండియ‌న్ కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ-ఇన్‌) వెల్ల‌డించింది. అందులో ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌ను టార్గెట్ చేసి ఇన్‌క‌మ్ టాక్స్ రిఫండ్స్ జ‌న‌రేష‌న్ పేరుతో ఫ్రాడ్ చేస్తున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వం కూడా హెచ్చ‌రిస్తోంది.

అందుకే.. ఏ యాప్స్ అయినా స‌రే.. గూగుల్ ప్లే నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సైబ‌ర్ నిపుణులు సూచిస్తున్నారు. ఒక యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవ‌డానికి ముందే.. యాప్ డిటైల్స్‌ను రివ్యూ చేసుకోవాలి. ఎన్ని డౌన్‌లోడ్స్ ఉన్నాయి. యూజ‌ర్ల రివ్యూ, కామెంట్స్‌, అఫిషియ‌ల్ సోర్స్ అన్నీ చెక్ చేసుకున్నాక‌నే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే.. సైబ‌ర్ క్రిమినల్స్ బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

SpaceX | నెక్స్ట్ అంత‌రిక్ష ప్ర‌యాణంలో ఫ్రీ వైఫై, వేడి వేడి ఆహారం: ఎలోన్ మస్క్

Emails : మీ ఈమెయిల్స్‌ను ఎవ‌రో ట్రాక్ చేస్తున్న‌ట్టు అనిపిస్తోందా? ట్రాక్ ఆప్ష‌న్‌ను ఇలా డిసేబుల్ చేసేయండి

Google TV : గూగుల్ టీవీలో ఫ్రీగా లైవ్ టీవీ చానెల్స్‌

Aadhaar and Bank Account Link : మీ ఆధార్ నెంబ‌ర్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో తెలియ‌దా? చెక్ చేసుకోండిలా

Junk Mails : జంక్ మెయిల్స్ ఇబ్బంది పెడుతున్నాయా? అవ‌స‌రం లేని మెయిల్స్‌ను ఒకేసారి ఇలా డిలీట్ చేసేయండి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement