AI Robot | నిజమైన మనిషిలా మీతో మాట్లాడే ఏఐ రోబో : త్వరలో ఎల్జీ న్యూ స్మార్ట్ హోం అసిస్టెంట్ లాంఛ్
సీఈఎస్ 2024 వేదికగా న్యూ స్మార్ట్ హోం అసిస్టెంట్‌ను (AI Robot) వెల్లడించేందుకు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సన్నాహాలు చేపట్టింది.
న్యూయార్క్ : సీఈఎస్ 2024 వేదికగా న్యూ స్మార్ట్ హోం అసిస్టెంట్‌ను (AI Robot) వెల్లడించేందుకు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సన్నాహాలు చేపట్టింది. ఇంటి పనులను చక్కదిద్దేందుకు ఈ అసిస్టెంట్ సూపర్ స్మార్ట్ హెల్పర్‌లా సేవలందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వాడుతుంది. ఇది చుట్టూ కలియతిరుగుతూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ మనుషులు ఏం చెబుతున్నారనేది అర్ధం చేసుకుంటుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఏఐ రోబో పెంపుడు జంతువులను చూసుకోవడంతో పాటు ఇంటినీ జాగ్రత్తగా చూసుకుంటాయి.
చక్రాలు, కాళ్లతో ఈ స్మార్ట్ హోం అసిస్టెంట్‌ను రోబో తరహాలో డిజైన్ చేశారు. ఇది తన యజమాని ఇంట్లో సొంతంగా తనే తిరుగుతూ అప్పగించిన పనులను చక్కపెడుతుంది. ఇది మీతో మాట్లాడుతూ తన హావఃభావాలను కూడా ప్రదర్శిస్తుంది. మీరు ఏం చెబుతున్నదీ అర్ధం చేసుకోవడంతో పాటు ఇమేజ్‌లను గుర్తుపడుతుంది. మీ మాటల వెనుక అంతరార్ధన్ని గ్రహిస్తుంది.
ఇది నిజంగా ఓ మనిషి తరహాలో మీతో మాట్లాడుతుంది. ఈ స్మార్ట్ అసిస్టెంట్ మీ ఇంట్లో కంట్రోల్ సెంటర్‌గా వ్యవహరిస్తుంది. మీ స్మార్ట్ అప్లయన్సెస్, డివైజ్‌లను అన్నింటితో కనెక్ట్ అయి వాటిని మేనేజ్ చేస్తుంది. మీరు ఇంట్లో లేని సమయంలో లైట్లు ఆపడం, మీ పెంపుడు జంతువులను చూసుకోవడం కూడా చేస్తుంది. క్వాల్‌కాం టెక్నాలజీస్ తయారుచేసిన శక్తివంతమైన సిస్టమ్‌తో ఇది అనుసంధానించబడి ఉంటుంది. దీంతో ఇది ముఖాలను, యూజర్లను గుర్తుపట్టడంఒతో పాటు మీ ఇంట్లో టెంపరేచర్, ఎయిర్ క్వాలిటీని చెక్ చేసేందుకు ఇది కెమెరా, సెన్సర్లను కలిగిఉంటుంది.
Read More :
Vivo Y28 5G | త్వరలో భారత్ మార్కెట్లోకి వివో వై28 5జీ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Bill Gates | ఏఐ టెక్నాలజీతో వేగంగా నూతన ఆవిష్కరణలు : బిల్ గేట్స్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

