Vivo Y28 5G | త్వరలో భారత్ మార్కెట్లోకి వివో వై28 5జీ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Vivo Y28 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వై28 5జీ (Vivo Y28 5G) ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Vivo Y28 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వై28 5జీ (Vivo Y28 5G) ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గత జూలైలో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన వివో వై27 5జీ (Vivo Y27 5G) ఫోన్‌కు కొనసాగింపుగా వివో వై28 5జీ ఫోన్ వస్తున్నది. క్రిస్టల్ పర్పుల్, గ్లిట్టర్ ఆక్వా కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఆవిష్కరణ తేదీ ఇంకా వెల్లడించలేదు. కానీ మూడు స్టోరేజీ ఆప్షన్లతో వస్తోంది వివో వై28 5జీ ఫోన్.
వివో వై28 5జీ ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.13,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.15,499, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.16,999 ఉంటుందని చెబుతున్నారు. ఈ ఫోన్ కొనుగోళ్లపై రూ.1500 వరకూ ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుందని తెలుస్తున్నది. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్ సెట్, 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సర్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉండొచ్చు.
ఇంతకుముందు వివో వై27 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ సెట్, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్13 వర్షన్‌పై పని చేస్తుంది. 6.64 అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2388 పిక్సెల్స్) ఎల్సీడీ ప్యానెల్ డిస్ ప్లే కలిగి ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Venkatesh | 30న వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’
Delhi Airport | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పంజాబ్ సీఎం నిలిపివేత.. ఇది కేంద్రం వేధింపులేనని ఆప్ ఆరోపణ
Credit Cards | క్రెడిట్ కార్డు చెల్లింపులు ఆలస్యమైనా చార్జీల్లేవ్.. యూజర్లకు ఆర్బీఐ ఊరట
Parakala Prabhakar | ‘సర్’ వ్యతిరేక నిరసనలో పరకాల ప్రభాకర్
Rajiv Yuva Vikasam | కొందరికే యువవికాసం.. యువతకు మరోసారి కాంగ్రెస్ దగా!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

