లేఆఫ్స్ సీజన్ : 60 మంది ఉద్యోగులను తొలగించిన కాయిన్‌బేస్!
ట్విట్టర్, మెటా మాస్ లేఆఫ్స్‌తో ఉద్యోగులను వణికించగా తాజాగా క్రిప్టో ఎక్స్ఛేంజ్ కాయిన్‌బేస్ 60 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. మూడో క్వార్టర్లో సంస్ధను నికర నష్టాలు వెంటాడటంతో వ్యయ నియంత్రణ కోసం కాయిన్‌బేస్ ఉద్యోగులపై వేటు వేసింది. కాయిన్‌బేస్ ఈ ఏడాది జాబ్ కట్స్‌కు పాల్పడటం ఇదే తొలిసారి కాదు.
న్యూయార్క్ : ట్విట్టర్, మెటా మాస్ లేఆఫ్స్‌తో ఉద్యోగులను వణికించగా తాజాగా క్రిప్టో ఎక్స్ఛేంజ్ కాయిన్‌బేస్ 60 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. మూడో క్వార్టర్లో సంస్ధను నికర నష్టాలు వెంటాడటంతో వ్యయ నియంత్రణ కోసం కాయిన్‌బేస్ ఉద్యోగులపై వేటు వేసింది. కాయిన్‌బేస్ ఈ ఏడాది జాబ్ కట్స్‌కు పాల్పడటం ఇదే తొలిసారి కాదు.
జూన్‌లో తమ ఉద్యోగుల్లో 18 శాతంగా ఉన్న 1100 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించింది. రెండో విడత లేఆఫ్స్‌లో తన రిక్రూటింగ్, ఇనిస్టిట్యూషనల్ ఆన్‌బోర్డింగ్ టీమ్స్ నుంచి 60 మంది ఉద్యోగులను తొలగించినట్టు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. రెండో దశలో కాయిన్‌బేస్ మరికొంతమంది ఉద్యోగులను తొలగించవచ్చని వార్తలు వస్తున్నాయి.
ట్విట్టర్ ఇటీవల 3000కు మందికి పైగా ఉద్యోగులను సాగనంపడం, సోషల్‌మీడియా దిగ్గజం మెటా ఏకంగా 11,000 మందిని తొలగించిన క్రమంలో కాయిన్‌బేస్ తాజా లేఆఫ్స్‌ను ప్రకటించడం గమనార్హం. ఇక ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతుండటం, మందగమనం నేపధ్యంలో టెక్ కంపెనీలు లేఆఫ్స్‌కు దిగుతున్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR Attender | రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత భరోసా!
KCR | మణికుమార్ రెడ్డి మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి
Manoj Bajpayee | ప్రేమ, మానవత్వం ముందు అవి నిలవలేవు.. ప్రోపగాండా సినిమాలపై మనోజ్ బాజ్పేయీ సంచలన వ్యాఖ్యలు.!
Congress | తెలంగాణ నూతన ఏఐసీసీ కార్యదర్శి సందీప్‌తో అసంతృప్త ఎమ్మెల్యేల భేటీ
Ramayana | ‘రామాయణ’ ప్రేక్షకులకు అదిరిపోయే ఆఫర్.. నేడు కేవలం రూ.99కే సినిమా టికెట్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

