ఈ శుక్రవారం వచ్చిన సినిమాల్లో “6 జర్నీ” ఒకటి. అందరూ కొత్త వాళ్లతోవచ్చిన ఈ సినిమాకు బసీర్ ఆలూరి దర్శకత్వం వహించాడు. చైనా టెర్రరిజం మీద రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం..
కథ ఏంటంటే..
హైదరాబాద్ సిటీలో డిఫరెంట్ మర్డర్స్ జరుగుతాయి. ఒక ఫోన్ వచ్చిన వెంటనే కొంతమంది చెవిలో నుంచి రక్తం కారి మరణిస్తారు. మరోవైపు సెల్ సిగ్నల్స్ కంట్రోల్ చేసే గవర్నమెంట్ ఆఫీసర్స్ కిడ్నాప్ అవుతారు. ఇలా సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఆరుగురు యువతీయువకులు (రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి & కో) గోవా టూర్‌కు బయల్దేరతారు. ఆ జర్నీలో ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగితే ఇస్తారు. ఆ జర్నీలో ఆరుగురు ఫ్రెండ్స్‌కు ఆ వ్యక్తి మీద అనుమానం కలుగుతుంది. నగరంలో జరిగే డిఫరెంట్ మర్డర్స్ అతనే చేసి ఉంటాడనే అనుమానం వస్తుంది. దీంతో ఆ సైకో నుంచి తప్పించుకోవాలని చూస్తారు. ఈ క్రమంలో ఆ ఆరుగురు ఫ్రెండ్స్, సైకోను తీవ్రవాదులు కిడ్నాప్ చేస్తారు.
ఇంతకీ టెర్రిరస్టుల డిమాండ్ ఏంటి? ఫోన్ వచ్చిన వెంటనే కొందరు ఎలా మరణించారు? దానికి కారణం ఏంటి? తీవ్రవాదుల నుంచి రాబోయే ముప్పును ఆ ఆరుగురు ఎలా ఎదుర్కొన్నారు? అసలు ఆ సైకో ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
మన సినిమాల్లో టెర్రరిస్టుల ప్రస్తావన అంటే ప్రతిసారి పాకిస్థాన్నే చూపిస్తారు. అయితే ఈ సినిమాలో చైనా టెర్రరిజం చూపించారు. తీవ్రవాదం అంటే కేవలం తుపాకీ పట్టి చేసేది మాత్రమే కాదని.. టెక్నాలజీపరంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా తీవ్రవాదం కూడా ఎలా కొత్త పుంతలు తొక్కుతుందనేది ఈ సినిమాలో చూపించారు. దర్శకుడు బషీర్ ఆలూరి ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇప్పటివరకు తీవ్రవాదం నేపథ్యంలో టాలీవుడ్ స్క్రీన్ మీద రాని కొత్త కథ చూపించారు. అయితే ఆ కథను అంతే ఎఫెక్టివ్‌గా స్క్రీన్ మీదకు తీసుకురావడంలో కాస్త తడబాటుకు గురయ్యాడు.
సినిమా ఆరంభం చాలా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తు్ంది. సెల్‌ఫోన్ సిగ్నల్ ద్వారా మర్డర్ చేయడమే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. ఆ వెంటనే ఆరుగురు స్నేహితులను పరిచయం చేయడం, ఆ ట్రావెలింగ్ ఎపిసోడ్ అంతా కూడా రెగ్యులర్‌గా అనిపిస్తుంది. లవ్ స్టోరీ, కామెడీ ఎపిసోడ్స్‌తో సినిమా బోరింగ్‌గా అనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే లిఫ్ట్ అడిగిన వ్యక్తి మీద ఆ ఆరుగురికి అనుమానం వస్తుందో అప్పట్నుంచి కథ కొంచెం టెన్షన్ క్రియేట్ చేస్తుంది. కానీ దాన్ని చివరకు కొనసాగించలేకపోయాడు డైరెక్టర్.
దర్శకుడు బషీర్ ఆలూరి తీసుకున్న కాన్సెప్ట్ బాగున్న ఎగ్జిక్యూషన్ పరంగా కొంత తడబాటుకు గురయ్యారు. ఆర్టిస్టులలో మెజారిటీ జనాలు కొత్తవాళ్లు కావడం కూడా సినిమాకు కొంత మైనస్ అయింది. అయితే నిర్మాత కొత్త వాళ్ళ మీద ఖర్చుపెట్టి తీశారు. దేశభక్తి, హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ మీద డైలాగులు బాగున్నాయి.
ఎవరెలా చేశారంటే..
హీరోగా పరిచయమైన రవి ప్రకాష్ రెడ్డి తన పాత్ర వరకు న్యాయం చేశాడు. అయితే ఆయన చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ముగ్గురు అమ్మాయిలలో ఇద్దరు గ్లామర్‌గా కనిపించారు. టేస్టీ తేజ నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా నటీనటుల్లో పేరు ఉన్న ఆర్టిస్టులు లేరు. సీజనల్ స్టార్ కాస్ట్‌ను ఎంపిక చేసుకునే ఉంటే బాగుండేది.
చివరగా.. దేశభక్తి నేపథ్యంలో సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకులను కొంతవరకు సాటిస్ఫై చేసే సినిమా సిక్స్ జర్నీ. ఇండో పాక్ మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను నేపథ్యంలో కరెంటు మూడ్ రిప్రజెంట్ చేసే సినిమా ఇది.