సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ): గ్రేటర్లో ఏదైనా ఇంటి చిరునామా కనుగొనాలంటే నానా తిప్పలూ పడాల్సిందే.. ఈ సమస్యను అధిగమించేందుకు జీహెచ్ఎంసీ తెరపైకి కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నది. గ్రేటర్‌లోని ఇండ్లకు డిజిటల్ నంబర్లు కేటాయించనున్నది. ప్రతి డిజిటల్ డోర్ నంబర్లో ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సంబంధిత ఇంటి యజమాని పేరుతో సహా చిరునామా సులభంగా కనుక్కునే వీలు ఉంటుంది. క్యూఆర్ కోడ్‌తో పాటు గూగుల్ మ్యాప్ ద్వారా ఎకడి నుంచైనా సాన్ చేసి నేరుగా ఆ ఇంటికి వచ్చేయవచ్చు. చిరునామా దొరకలేదనే సమస్యే ఉండదు. విధి విధానాలు రూపకల్పన చేసిన జీహెచ్ఎంసీ అధికారులు నూతన సంవత్సర కానుకగా వచ్చే నెలలో డిజిటల్ డోర్ నంబర్ అనే విధానాన్ని అమలు చేసేలా సన్నాహాలు చేస్తున్నది. ఈ విధానం కొన్ని మెట్రో నగరాలు, ఎక్కువగా విదేశాల్లో కొనసాగుతుందని, డిజిటల్ డోర్ నంబర్ అన్ని విధాలుగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.