తాండూరు, మార్చి 7: తెలంగాణ సర్కార్ హయాంలో సీఎం కేసీఆర్ మహిళలకు పెద్దపీట వేసి మహిళల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూన్నారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి వృద్ధురాలి వరకు అందరికీ సాయం అందేలా పథకాల రూపకల్పన చేశాడు. ఒంటరి మహిళలకు నెలకు రూ.2016 పింఛన్, మహిళలకు వడ్డీలేని రుణాలు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, ఆరోగ్యలక్ష్మి, షీ టీమ్స్ ఏర్పాటు, బాలికలకు ప్రత్యేక గురుకులాలు, కుల, మత తారతమ్యాలు లేకుండా అమలవుతున్న పథకాలపై, ముఖ్యంగా రాజకీయ రంగంలో మహిళకు ఇస్తున్న ప్రాధాన్యంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో రాజకీయాల్లోకి మహిళలు ఎక్కువగా వస్తున్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో 21 మంది మహిళలే ఉన్నారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కూడ మహిళలే ఉన్నారు. నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లోని ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో కూడ మహిళలే అధికంగా ఉన్నారు.
తాండూరు మండలంలో 15 ఎంపీటీసీల స్థానాల్లో 9 మంది మహిళలు, బషీరాబాద్ మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలకు 7 మంది మహిళలు, పెద్దేముల్ మండలంలో 13 ఎంపీటీసీల స్థానాల్లో 7 మంది మహిళలు, యాలాల మండలంలో 13 ఎంపీటీసీల స్థానాల్లో ఆరుగురు మహిళలు పదవులు చేపట్టారు. ముఖ్యంగా తాండూరు నియోజక వర్గంలోని 4 ఎంపీపీ, వైస్‌ఎంపీపీ స్థానాల్లో మూడు చోట్ల ఎంపీపీ, వైస్ ఎంపీపీల పదవులను మహిళలే చేపట్టడం తెలంగాణ సర్కార్ మహిళలకు ఇచ్చే గౌరవానికి నిదర్శనం. తాండూరు ఎంపీపీగా అనిత, వైస్ ఎంపీపీగా స్వరూప, బషీరాబాద్ ఎంపీపీగా కరుణ, వైస్ ఎంపీపీగా అన్నపూర్ణ, పెద్దేముల్ ఎంపీపీగా అనురాధ, వైస్ ఎంపీపీగా మధులత కీలక పదవులు చేపట్టారు. అదే విధంగా తాండూరు జడ్పీటీసీగా మంజుల, యాలాల జడ్పీటీసీగా సంధ్యారాణితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడ మహిళ కావడంతో జిల్లా వ్యాప్తంగా రాజకీయ రంగంలో మహిళలు దూసుకు పోతున్నారు.
ఎంతో మంది రాణిస్తున్నారు..
రాజకీయ రంగంలో రిజర్వేజన్లు కల్పించడంతో ఎంతో మంది రాణిస్తున్నారు. మహి ళలు ఇంటితో పాటు ఊరును పరిపాలించేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే. మహిళలపై వేధింపులు, అసభ్యకరంగా వ్యవహరించే పోకిరీలపై చర్యలు తీసుకుని రక్షణ కల్పిం చేం దుకు షీ టీమ్స్ ఏర్పాటు చేసి 100, 1098కు ఫోన్ చేస్తే క్షణాల్లో పోలీసులు స్పం దిం చేలా చేయడం అభినందనీయం
–స్వప్న, మున్సిపల్ చైర్పర్సన్ తాండూరు
ఆదర్శవంతమైన పథకాలతో వెలుగులు
ఆడపిల్లల వివాహాలకు తల్లిదండ్రులు ఆర్థికంగా పడుతున్న కష్టాలను తగ్గించేందుకు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తుండడంతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. మరో వైపు సురక్షితంగా డెలివ రీలను ప్రోత్సహించేందుకు, మాతాశిశు మరణాలను నివా రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశ పెట్టడం అభినందనీయం.
–అనురాధ, ఎంపీపీ పెద్దేముల్
తెలంగాణ సర్కార్ ప్రోత్సాహం మరువలేనిది
విద్య, వైద్య, ఆర్థిక, సామాజిక, సంక్షేమ రాజకీయ రంగాల్లో మహిళల సర్వతో ముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి మరువలేనిది. మహిళా దినోత్సవం రోజు ప్రత్యేకంగా సెల వు ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది. సర్పంచ్‌గా గ్రామాభివృద్ధికి పాటుపడుతూ ముందుకు వెళ్లే సందర్భా ల్లో సర్కారు ప్రోత్సాహం మరింత ఉత్తేజాన్ని ఇస్తున్నది.
– చిట్టెపు బాలమణి , ముబారక్పూర్ గ్రామ సర్పంచ్
మరింత ప్రాధాన్యం అవసరం
మహిళాలోకం ఏకం కావాల్సిన అవసరం ఉంది. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. రాబో యే రోజుల్లో రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యం మరింత అవసరం . పార్లమెంట్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే సంకల్పంతో ఎమ్మెల్సీ కవిత ముందుకు వెళు తున్నారు. ఆమె వెంట తెలంగాణ రాష్ట్రంలోని మహిళాలోకం ఉంది.
–శకుంతల దేశ్‌పాండే, బీఆర్ఎస్ నియోజకర్గ కన్వీనర్, తాండూరు.