Kodangal : రైతులకు వరి నాటు యంత్రం ఎంతో ఉపయోగం.. ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

కొడంగల్ : ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించుకునే దిశగా రైతులు అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రైతులను కోరారు. బుధవారం కొడంగల్ పట్టణంతో పాటు మండలంలోని పర్సాపూర్, హస్నాబాద్ గ్రామాల్లోని ఆయా పాఠశాలలో విద్యార్థులకు మాస్క్, శానిటైజర్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ శివారులో వ్యవసాయ శాఖ వారు చేపట్టిన యంత్రంతో వరినాటు పద్ధతిని పరిశీలించారు. కంపెనీ యజమాన్యం ద్వారా యంత్ర వినియోగం, ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో వ్యవసాయ సాగులో ఎన్నో అధునాతన పద్ధతులు, యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయని, వాటిపై అవగాహన పెంచుకొని వ్యవసాయంలో అధిగమించాలని తెలిపారు.
ఇప్పటి వరకు వరికోత యంత్రాలు అందుబాటులో ఉండగా ప్రస్తుతం నూతనంగా నాటు యంత్రం వచ్చిందని, రైతులు యంత్ర పరికరాలను సద్వినియోగం చేసుకొని సాగు చేపట్టాలని పేర్కొన్నారు. యంత్రంతో వరి నాటు వేసుకోవడం వల్ల ఎకరాకు రూ. 200 ఖర్చు రావడం రైతులకు శుభసూచకంగా పేర్కొన్నారు. ప్రస్తుతం కూలీల కొరతను అధిగమించడంతో పాటు పెట్టుబడిని తగ్గించుకొని వ్యవసాయం చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో హస్నాబాద్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్, పర్సాపూర్ గ్రామంలోని ప్రాథమిక కొన్నత పాఠశాలలో విద్యార్థులకు మండల పరిషత్ ద్వారా మాస్కులు, శానిటైజర్లను అందించడంతో పాటు 8, 9, 10 తరగతులు విద్యార్థులు మంత్రి సబిత ఇంద్రారెడ్డి అందించిన డిక్షనరీలను పంపిణీ చేశారు.
అదే విధంగా పర్సాపూర్, హస్నాబాద్ గ్రామాల్లో వినాయక విగ్రహాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, సర్పంచ్‌లు పకీరప్ప, సయ్యద్ అంజద్, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూధన్‌యాదవ్, పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సిద్దిలింగప్ప, సురేష్, ఎంట్ల మల్లయ్య, వ్యవసాయాధికారులు ఏడీఏ వినయ్‌కుమార్, ఏవో బాలాజీ ప్రసాద్, ఏఈవో ఢాఖ్యానాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

