పెద్దేముల్ : మండల పరిధిలోని ఊరెంటితాండ గ్రామంలో నాటు సారా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని శనివారం తాండూరు ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. తాండూరు ఎక్సైజ్ సీఐ తుక్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రోహెబిషనరీ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్ ఆదేశానుసారం, దసరా పండుగ సందర్భంగా పెద్దేముల్ మండల పరిధిలోని అడికిచెర్ల తండా, ఊరెంటితండా, ఓమ్లానాయక్ తండా, తట్టేపల్లి తండా గ్రామాల్లో సోదాలు నిర్వహించగా ఊరెంటితండా గ్రామానికి చెందిన అమర్‌సింగ్ అనే వ్యక్తి 4లీటర్ల సారాతో దొరికాడు.
దీంతో వారు అతనిపై కేసు నమోదు చేశారు. కాగా ఈ సోదాల్లో ఏసీ ఎన్ఫోర్స్మెంట్, రంగారెడ్డి జిల్లా, డిటీఎఫ్ వికారాబాద్ జిల్లా వారితో పాటు తాండూరు ఎక్సైజ్ సీఐ తుక్యానాయక్, ఇతర ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు.