మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన
గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన లభించింది.
- వికారాబాద్ జిల్లా నుంచి తరలివచ్చిన 1,728 మంది నిరుద్యోగులు
- వివిధ ఉద్యోగాలకు ఎంపికైన 672 మంది యువతీయువకులు
- మెగా జాబ్‌మేళాలో పాల్గొన్న 60 కంపెనీలు
- టీఎస్ఎస్టీఈపీ, ధ్రువ్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో నిర్వహణ
- ప్రారంభించిన ఎమ్మెల్యేలు ఆనంద్, నరేందర్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి
వికారాబాద్, జనవరి 28(నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన లభించింది. వికారాబాద్ పట్టణంలోని నర్సింగ్ ఫంక్షన్ హాల్లో టీఎస్ఎస్టీఈపీ(తెలంగాణ రాష్ట్ర శిక్షణ, ఉపాధి సొసైటీ), ధ్రువ్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఈ జాబ్‌మేళాను ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి, మహేశ్‌రెడ్డిలు ప్రారంభించారు. 60 కంపెనీల్లో ఏడు వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాలకు చెందిన యువతీయువకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మొదట నిరుద్యోగులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం జాబ్‌మేళా వేదికలో ఏర్పాటు చేసిన 60 కంపెనీల వివరాలతోపాటు ఆయా కంపెనీల్లో ఉన్న ఖాళీలు, అర్హతలు, జీతం వివరాలను పొందుపర్చిన ఫ్లెక్సీలో తమ విద్యార్హతకు ఏ ఉద్యోగం సరిపోతుందో తెలుసుకొని ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
అదేవిధంగా 60 కంపెనీల ప్రతినిధులు ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రభు త్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్‌మేళాలో 1,728 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేయించుకోగా 672 మంది ఆయా కంపెనీలకు ఎంపికయ్యారు. అక్కడే ఎంపికైన వారికి ఆయా కంపెనీల ప్రతినిధులు ఆఫర్ లెటర్లను అందజేశారు. ఈ జాబ్‌మేళాలో వికారాబాద్ పట్టణానికి చెందిన ప్రఖ్యాత్ అత్యధికంగా రూ.35 వేల వేతనానికి విజయ ఫర్టిలైజర్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగానికి ఎంపిక కావడం గమనార్హం. ఈ మేళాలో పదోతరగతి పాస్ లేదా ఫెయిల్ మొదలుకొని పీజీ వరకు, ఇంజినీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఎంబీఏ, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్ విద్యార్హతతో కూడిన నిరుద్యోగులు పాల్గొన్నారు.
ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది
ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉన్నది. ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూనే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తా. ఇందుకోసం కఠిన సాధన చేస్తా. అవకాశం ఇచ్చిన కంపెనీ నిర్వాహకులకు కృతజ్ఞతలు.
-సునీత, రామయ్యగూడు, వికారాబాద్
బాగా పని చేస్తా..
జాబ్‌మేళాలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. చిన్న ఉద్యోగమని నిరాశ చెందకుండా బాగా పని చేస్తా. కంపెనీలో పని చేసుకుంటూనే పై చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తా. జాబ్‌మేళాను నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-రమేశ్, కర్నూలు జిల్లా
ప్రభుత్వానికి ధన్యవాదాలు
జిల్లా కేంద్రంలో జాబ్‌మేళా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మేళా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయుక్తంగా మారిం ది. నాతోపాటు పలువురు వివి ధ కంపెనీల్లో ఉద్యోగాలను సాధించారు. ఇంత మంచి అవకాశం కల్పించి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.
-రాములు, నవాబుపేట మండలం
గతంలో ఎప్పుడూ నిర్వహించలేదు
గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్దగా జాబ్‌మేళాను నిర్వహించలేదు. జిల్లా కేంద్రంలో జరిగి న మేళాకు నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. 60 కంపెనీల నుంచి ప్రతినిధులు రావడం హర్షణీయం. కంపెనీ లో ఉద్యోగం పొందడం చాలా సంతోషంగా ఉంది.
-షేక్ ఇలియాస్, ఎన్నారం గ్రామం, కోట్‌పల్లి మండలం
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

