vikrabad | అలుగు పారుతున్న కాకరవాణి ప్రాజెక్టు

బొంరాస్పేట : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని ఏర్పుమళ్ల గ్రామానికి సమీపంలో ఉన్న కాకరవాణి ప్రాజెక్టు నిండి అలుగు పారుతుంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టు నిండు కుండలా మారింది. రెండు సంవత్సరాల నుంచి వరుసగా కాకరవాణి ప్రాజెక్టు అలుగు పారుతుంది. ప్రాజెక్టు కింద 600ఎకరాల ఆయకట్టు కింద పంట పొలాలు ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో ఆయకట్టు కింది రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ప్రాజెక్టు వద్దకు చేరుకుని అలుగు పారే దృశ్యాలను తిలకిస్తున్నారు.
ఇదిలా ఉండగా భారీ వర్షాల వల్ల బొంరాస్పేట, మెట్లకుంట చెరువుల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. కాకరవాణి ప్రాజెక్టు అలుగు ద్వారా వచ్చే వరద నీరు ఏటి కాలువ ద్వారా బొంరాస్పేట పెద్ద చెరువులోకి వస్తుంది. వర్షాలు ఇలాగే కురిస్తే బొంరాస్పేట, మెట్లకుంట చెరువులు కూడా నిండే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

