మారేడు నీవని..
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జాము నుంచే మహాదేవుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. హరహర మహాదేవ... శంభో శంకర అన్న నినాదాలతో శివాలయాలు మార్మోగాయి. త్రినేత్రుడిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం ఉపవాస దీక్షలు విరమించారు.
- భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి వేడుకలు
- భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు
- శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు
- తెల్లవారుజాము నుంచే అభిషేకాలు, అర్చనలు
- త్రినేత్రుడి దర్శనం తర్వాత ఉపవాస దీక్షల విరమణ
- మహేశ్వరంలోని రామలింగేశ్వర ఆలయంలో పరమేశ్వరుడికి క్షీరాభిషేకం చేసిన మంత్రి సబితారెడ్డి
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జాము నుంచే మహాదేవుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. హరహర మహాదేవ… శంభో శంకర అన్న నినాదాలతో శివాలయాలు మార్మోగాయి. త్రినేత్రుడిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం ఉపవాస దీక్షలు విరమించారు. మహేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరమేశ్వరుడికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. పలుచోట్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పైలెట్ రోహిత్‌రెడ్డి, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు నీలకంఠుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాగారాలు చేసే భక్తుల కోసం పలు శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం శివాలయాలు ఓం నమ ః శివాయ.. శంభో శంకర.. హరహర మహాదేవ అంటూ శివనామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు పరమశివుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివుడికి అత్యంత ఇష్టమైన బిల్వపత్రంతో స్వామి వారిని పూజించారు. శివలింగానికి అభిషేకాలు, అర్చనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని వసతులు కల్పించారు. ఫ్రూట్ మార్కెట్ల వద్ద జనం బారులు తీరారు.
– న్యూస్‌నెట్‌వర్క్, నమస్తేతెలంగాణ, మార్చి 1
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

