ఆపదలో ఆదుకుంటారు సేవలో ముందుంటారు..

- ప్రజా సేవకే అంకితమైన దాన్వి హెల్త్ కేర్
- ఉచిత వైద్య శిబిరాలతో
- వేల మందికి సేవలు
- లాక్డౌన్ కాలంలో వలస కార్మికులకు ఆర్థిక సాయం
- ప్రజా సేవకే సిద్ధమై..
గద్వాల బుర్జు సాయినగర్ ప్రాంతానికి చెందిన కందుల శ్రీనివాస్‌రెడ్డి, కందుల శ్రవంతి దంపతులు మణికొండకు వచ్చి స్థిరపడ్డారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు చదివిన వారు 25 ఏండ్లుగా వైద్య సేవలందిస్తున్నారు. ప్రతీ వీకెండ్లో దాదాపు 250కి పైగా ‘దాన్వి హెల్త్‌కేర్’ పేరిట వైద్య శిబిరాలను నిర్వహించారు. కరోనా మొదటి దశలో ప్రభుత్వాధికారుల అనుమతితో పేద, మధ్య తరగతి వారి కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. మందులు పంపిణీ చేశారు. కావాల్సిన వారికి అనేక సేవలందించి ఆదర్శనీయంగా నిలిచారు. మొదటి దశ లాక్డౌన్లో మణికొండ, నార్సింగ్ మున్సిపాలిటీల పరిధిలో బహుళ అంతస్థుల్లో పని చేసే 300 మంది ఇతర రాష్ట్ర కార్మికులు ఇక్కడే చిక్కుకుపోయారు.
వీరి ఆరోగ్య సమస్యలను దాన్వి హెల్త్ కేర్ ముందుండి పరిష్కరించింది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో పని చేసే వైద్యులతో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. సొంత ఖర్చుతో మందులు పంపిణీ చేసింది. మొత్తం లాక్డౌన్ కాలంలో 17 ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 9 వేల మంది కార్మికులకు సేవలందించినట్లు దాన్వి హెల్త్ కేర్ సీఈవో శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసిన తర్వాత పేదల ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకే దాన్వి హెల్త్ కేర్ ఏర్పాటు చేశామన్నారు.
g మణికొండ మున్సిపాలిటీలో విజృంభించిన డెంగీపై స్థానికులకు అవగాహన కల్పించేందుకు దాదాపు 150 సార్లు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అంతేకాక చుట్టుపక్కల గ్రామాల్లోనూ వందల సార్లు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి సేవలందించారు.
సేవలో ముందుంటాం..
కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అస్వస్థతకు గురవుతున్న వారి కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పుడు పేదల ఆరోగ్యంపై దృష్టి పెట్టాం. ప్రస్తుతం సెకండ్ వేవ్‌లోనూ ఆన్లైన్లో వైద్య సేవలు, సలహాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. మా సేవలు పొందాలనుకునే వారు 9951646660 నంబరుకు ఫోన్ చేస్తే చాలు. ఆన్లైన్లో వైద్యాధికారులు బాధితులను పలుకరించి ఆరోగ్య సమస్యలపై సూచనలు ఇస్తారు. అవసరమైతే దవాఖానాల్లో చేర్పించే ఏర్పాట్లు సైతం చేస్తున్నాం. -కందుల శ్రీనివాస్‌రెడ్డి-సీఈవో, దాన్వి హెల్త్‌కేర్ సంస్థ
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

