నేడు మల్లన్న లష్కర్ వారం
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జునస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత మొదటి ఆదివారం స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
- భారీగా తరలిరానున్న నగరవాసులు
- పట్నాలు వేసి మొక్కులు చెల్లించనున్న భక్తజనం
- వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
చేర్యాల, జనవరి 28 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జునస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత మొదటి ఆదివారం స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాల్లో స్వామివారి కల్యాణం, పట్నం వారం, లష్కర్ వారం, మహాశివరాత్రి రోజున నిర్వహించే పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ వర్గాలు ఆలయం, రాజగోపురం, గదులకు రంగులు వేయించి సుందరంగా ముస్తాబు చేశారు. ఈ నెల 22న ఆదివారం నిర్వహించిన పట్నం వారానికి భక్తులు పోటెత్తారు. యాభై వేల పైచిలుకు భక్తులు ఆలయాన్ని దర్శించుకున్నారు. హైదరాబాద్కు చెందిన భక్తులు మల్లన్న పేరిట సట్టీ దీక్షలను 41 రోజులపాటు భక్తిశ్రద్ధలతో చేపట్టి ఆలయంలో విరమించారు. స్వామివారితో పాటు పట్నం వేసి గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించారు. బ్రహ్మోత్సవాల సమయంలో తొమ్మిది ఆదివారాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. భక్తుల సౌకర్యార్థం ఆలయవర్గాలు ఈ సంవత్సరం ప్రత్యేకంగా క్యూలైన్లలో తాగునీటి వసతి కల్పిస్తున్నారు. భక్తులకు విశిష్ట దర్శనం, శ్రీఘ్రదర్శనం, ధర్మ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఉత్సవాలకు ఏర్పాట్లు..
ఉత్సవాల్లో రెండో ఆదివారం (నేడు) లష్కర్ వారం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు సికింద్రాబాద్ భక్తులతో పాటు కరీంనగర్, మెదక్, వరంగల్ పాత జిల్లాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. సికింద్రాబాద్ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మల్లన్న దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటుండటంతో రెండో ఆదివారానికి లష్కర్ వారంగా ఎనకటి నుంచి పిలుస్తున్నారు. ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఈవో ఎ.బాలాజీ తెలిపారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

