పెద్దేముల్ : మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో నవగ్రహల ప్రతిష్టాపనను గ్రామస్తులు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్యంగా మండల పరిధిలోని మంబాపూర్ గ్రామానికి చెందిన శివకుమార్ నాగమణి దంపతుల ఆధ్వర్యంలో స్థానిక ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో నవగ్రహాల ప్రతిష్ఠాపనను కన్నుల పండువగా నిర్వహించారు. ముఖ్యంగా గ్రామంలో నవగ్రహాల ప్రతిష్టాపనలో భాగంగా ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా శివకుమార్ నాగమణి దంపతుల, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా హోమాలు, పూజలను నిర్వహించారు. అనంతరం నవగ్రహాల ప్రతిష్ఠాపన నేపథ్యంలో ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో గ్రామస్తులకు గ్రామ పెద్దలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం నవగ్రహాలను ప్రతిష్టించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రావణ్‌కుమార్, ఎంపీటీసీ యాలాటి శ్రీనివాస్, మాజీ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్. నారాయణరెడ్డి పాల్గొన్నారు.