ఆరుతడిలో ఆదర్శం..
ఒక్కరు... కాదు ఇద్దరు కాదు.. ఆ ఐదు గ్రామాల రైతులది ఒకటే మాట.. ఒక్కటే బాటగా నడుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని కప్పాడు, తుర్కగూడ, చర్లపటేల్‌గూడ, కర్ణంగూడ, ఉప్పరిగూడ గ్రామాల రైతులు.
- కప్పాడు, తుర్కగూడ, చర్లపటేల్‌గూడ, కర్ణంగూడ, ఉప్పరిగూడ గ్రామాల్లో ఏండ్ల తరబడిగా కూరగాయల సాగు
- లాభదాయక ఆకుకూరల పైనే దృష్టి నగరంలోని పలు మార్కెట్లకు ఉత్పత్తుల తరలింపు
ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 31: ఒక్కరు… కాదు ఇద్దరు కాదు.. ఆ ఐదు గ్రామాల రైతులది ఒకటే మాట.. ఒక్కటే బాటగా నడుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని కప్పాడు, తుర్కగూడ, చర్లపటేల్‌గూడ, కర్ణంగూడ, ఉప్పరిగూడ గ్రామాల రైతులు. ఈ గ్రామాల్లోని రైతులందరూ ఆరుతడి పంటలైన కూరగాయలు, ఆకుకూరలే సాగుచేసుకుంటూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఏండ్ల తరబడిగా కూరగాయలు, ఆరుతడి పంటలు పండిస్తున్నారు. పాడి పరిశ్రమ చేపడుతూ.. ఆర్థికాభివృద్ధి చెందుతున్నారు. గ్రామాల్లోని రైతులు కొత్తిమీర, పుదీనా, మెంతి, పాలకూర, కొయ్యికూర, తోటకూర, బచ్చలికూర, సుక్కకూరతో పాటు ఆలుగడ్డ, చామగడ్డ, టమాట, బీర, చిక్కుడు, కాకర, బెండతో పాటు పలురకాల ఆరుతడి పంటలు, కూరగాయల పంటలను సాగుచేస్తున్నారు.
పండించిన పంటలను ఇబ్రహీంపట్నంతో పాటు నగరంలోని రైతుబజార్, ఎల్బీనగర్, మాదన్నపేట మార్కెట్లతో పాటు ఇతర మార్కెట్లకు తరలించి మంచి లాభాలు గడిస్తున్నారు. ఈ గ్రామాల్లో సుమారు 500మంది వరకు రైతు కుటుంబాలున్నాయి. నగరానికి అతిచేరువలో ఉన్న ఈ గ్రామాల్లో రైతులు ఎన్నో ఏండ్లుగా ఆకుకూరలు, కూరగాయలను సాగుచేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ రైతులందరూ చాలామంది ఆర్థికంగా స్థిరపడినప్పటికీ వ్యవసాయాన్ని మాత్రం మరువకుండా ఆకుకూరలు సాగుచేసుకుంటూ ప్రతిరోజూ ఉదయం మార్కెట్‌కు తరలించి అనంతరం ఇంటికొచ్చి తమ పనులను చూసుకుంటుంటారు. ఈ రైతులందరూ ఆకుకూరలు, కూరగాయల సాగుపైనే అధిక దృష్టి సారించి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఆకుకూరలకు కేరాఫ్‌గా కప్పాడు, తుర్కగూడ, చర్లపటేల్‌గూడ, కర్ణంగూడ, ఉప్పరిగూడ గ్రామాలు నిలుస్తున్నాయి.
ప్రతిరోజూ నగరానికి తరలింపు..
కప్పాడు, తుర్కగూడ, కర్ణంగూడ, చర్లపటేల్‌గూడ, ఉప్పరిగూడ గ్రామాల రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలను ప్రతిరోజూ ఇబ్రహీంపట్నంతో పాటు నగరంలోని పలు మార్కెట్లకు తరలిస్తారు. ఉదయం 5గంటలకు పొలాల్లోకి వెళ్లి కూరగాయలు, ఆకుకూరలు కోసుకుని మార్కెట్‌కు తరలించి మంచి లాభాలను గడిస్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రామాల్లో భార్యాభర్తలు కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ గ్రామాల్లో రైతులు ఐదారేండ్లుగా తమ ఇంటి అవసరాల మేరకు వరిపంటను సాగుచేసుకుంటూ ఇతర కూరగాయలు, ఆకుకూరల పంటలపై దృష్టి సారించి మంచి లాభాలు గడిస్తున్నారు. ఈ క్రమంలో ఈ గ్రామాలు జిల్లా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రతిరైతు వరికి బదులుగా ఆరుతడి పంటలతో పాటు కూరగాయలను సాగుచేయాలని అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు.
ఏండ్లతరబడిగా సాగుచేస్తున్నాం
ఎన్నో ఏండ్లుగా వరికి ప్రత్యామ్నాయంగా ఆకుకూరలు, కూరగాయల పంటలు సాగుచేస్తున్నాం. వాటిని నగరానికి తరలించి మంచిలాభం పొందుతున్నాం. ఆకుకూరలకు పెట్టుబడి తక్కువ, తక్కువ నీటితో కూరగాయలు సాగు చేసి మంచి ఆదాయం వస్తుండడంతో కూరగాయల సాగుపై దృష్టి సారించాం.
– ఏనుగు బుచ్చిరెడ్డి, రైతు, తుర్కగూడ
ఏడాదంతా సాగుచేస్తున్న..
నాకున్న పొలంలో ఇంటి అవసరానికి అరెకరం పొలంలో వరిపంట సాగుచేస్తా. మిగతా పొలంలో పాలకూర, కొయ్యికూర, పుంటికూర, కొత్తిమీర వంటి ఆకుకూరలు సాగుచేస్తా. కూలీలు, జీతగాళ్లు అవసరం లేకుండా మా కుటుంబ సభ్యులమందరం ఉదయాన్నే పొలానికి ఆకుకూరలను కట్టలు కట్టి నగరానికి తరలించి మంచి లాభాలు గడిస్తున్నాం. గత ఐదేండ్లుగా ఆకుకూరలు, కూరగాయల పంటలే సాగుచేస్తున్నా.
– నిట్టు బీరప్ప, రైతు కప్పాడు
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

