3 గంటల కరెంట్‌తో కాళరాత్రులే..
మూడు గంటల కరెంట్‌తో కాళ రాత్రులే దిక్కవుతాయని రంగారెడ్డి జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కరెంటు విషయంలో రైతులు పడిన కష్టాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
- పొలం తడవదు.. పంటలు పండవు
- భూములన్నీ బీడుగా మారుతాయి..
- 10 హెచ్‌పీ మోటర్లతో రైతులపై మోయలేని భారం
- 24 గంటల కరెంట్ సరఫరానే కొనసాగాలటున్నఅన్నదాతలు
మూడు గంటల కరెంట్‌తో ఎకరం పొలం కూడా పారక… భూములన్నీ బీడుగా మారుతాయని రైతులు చెబుతున్నారు. ఇక 10 హెచ్‌పీ బోరు మోటర్లతో మోయలేని భారం పడుతుందని, దీంతో అప్పులు చేయాల్సి దుస్థితి వస్తుందని వారు ఆందోళన పడుతున్నారు. టెన్ హెచ్‌పీ మోటర్లు నడిస్తే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయని, సబ్స్టేషన్లలో బ్రేక్డౌన్లు ఖాయమని వాపోతున్నారు. దీంతో పంటలు ఎండిపోయి అప్పుల పాలు కాక తప్పదని చెబుతున్నారు. ఇప్పుడిస్తున్న 24 గంటల కరెంట్ కొనసాగాలని కోరుకుంటున్నారు.
-రంగారెడ్డి, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : మూడు గంటల కరెంట్‌తో కాళ రాత్రులే దిక్కవుతాయని రంగారెడ్డి జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కరెంటు విషయంలో రైతులు పడిన కష్టాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో వచ్చిన కరెంట్‌తో పంటలు పండక తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట కరెంటుతో రైతులు అర్ధరాత్రి అపరాత్రి బాయిల దగ్గరకు వెళ్లే భయంకర అనుభవాలను మర్చిపోలేక పోతున్నామని చెబుతున్నారు. రాత్రి పూట బావుల వద్దకు వెళితే పాములు కరిచి, కరెంటు కాటుకు గురై ఎంతో మంది రైతులు మరణించారని, అవన్నీ కండ్ల ముందర కదలాడుతున్నాయని, బాధిత కుటుంబాలు ఇప్పటికీ పడుతున్న బాధలతో చలించిపోతున్నామని పేర్కొంటున్నారు.
అర్హత లేని పార్టీ అధికారంలోకి రాకముందే మూడు గంటల కరెంట్ ఇస్తామని చెబుతుండడంతో రైతులు ఆగ్రహిస్తున్నారు. ఇలాంటి పార్టీకి అధికారం ఇస్తే ఎదురయ్యే కరెంటు కష్టాలను తల్చుకుని భయపడుతున్నారు. కరెంటు విషయంలో సీఎం కేసీఆర్ తెచ్చిన సంస్కరణలను రైతులు కొనియాడుతున్నారు. 24 గంటల ఉచిత కరెంటుతో ధీమాగా బతుకుతున్నామని, కల్లబొల్లి మాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మితే బతుకుదెరువు కతమైతదని, బాయిల వద్ద జాగారాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 హెచ్‌పీ మోటర్లతో రైతులకు పెను భారమని, పనికిరాని ముచ్చట్లు చెబుతున్న మాయదారి నాయకులను ఎవరూ నమ్మరని స్పష్టం చేస్తున్నారు. రైతుల మేలు కోరి పని చేస్తున్న బీఆర్ఎస్కే మా మద్దతు అని జిల్లా రైతాంగం చెబుతున్నది.
ఎవుసం ఆగమే..
మూడు గంటల కరెంటుతో ఎవుసం ఆగమే.. ఎప్పుడస్తదో, ఎప్పుడు పోతదో తెల్వని కరెంట్‌తో మళ్లీ బావుల కాడ పడిగాపులు కాయాల్సిందే. 10 హెచ్‌పీ మోటర్ ఏర్పాటు చేస్తే అటు ట్రాన్స్ఫార్మర్లపై, ఇటు మోటర్లపై తీవ్ర ఒత్తిడి పెరిగి, కాలిపోయే ప్రమాదం ఉంది. వీటిని మరమ్మతులు చేయిస్తే, కొన్న ధరను మించి మెకానిక్‌లకు చెల్లించాలి.
– ఇమ్రాన్, సింగప్ప గూడ గ్రామం (చేవెళ్లటౌన్)
ఒక్క మడి కూడా పారదు..
బావుల్లో నీళ్లు ఉన్నా.. 10 హెచ్‌పీ మోటర్తో నష్టమే.. గట్లకు గండ్లు పడి నీరు వృథా అవుతది. ఒక్క మడి కూడా సరిగ్గా పారదు. 5 హెచ్‌పీ మోటర్లతో ఇబ్బంది లేకుండా సాగు చేసుకుంటున్నం. ఓ పార్టీ మాటలింటే మళ్లీ రాత్రిళ్లు బోరుబావుల వద్ద జాగారం చేయాల్సిందే. రాత్రి ట్రాన్స్ఫార్మర్ల ఫ్యూజ్ పోతే ఆ రోజు కరెంటు బందే. 24గంటల కరెంట్‌తో పండుగలా సాగు చేసుకుంటున్నం.
– జ్ఞానేశ్, షాద్‌నగర్‌టౌన్
మూడు గంటల కరెంట్ సరిపోదు..
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోదు.. కొందరు నాయకులు ఇష్టమొచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. ఎవుసం చేస్తే రైతుల కష్టాలు తెలుస్తయ్. 10 హెచ్‌పీ మోటర్ని పెట్టుకొనే ఆర్థిక స్థోమత లేదు. గడికిగడికి ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోతే ఎవరు చేయిస్తరు. 24 గంటలు కరెంట్‌తో చింతలేకుండా ఉన్నం.
-అమృతం పాండు, (కడ్తాల్)
కాల్వ అయినా సాగుతదా ?
మూడు గంటల కరెంట్‌తో కాల్వ అయినా సాగుతదా. వ్యవసాయం తెలిసి వాళ్లు ఎవరూ మూడు గంటల కరెంట్ సరిపోతుందని అనరు. 24 గంటల కరెంట్‌తోని రైతు నిబ్బరంగా పొలాలకు నీరు పారించుకుంటున్నాడు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ కరెంట్ కష్టాలు, కరెంట్ షాకులు తప్పేలా లేవు. ఏ రైతుకు కూడా 10 హెచ్‌పీ మోటరు అవసరం లేదు.
– నేనావత్ పత్యానాయక్, 3వ వార్డు, ఆమనగల్లు మున్సిపాలిటీ (ఆమనగల్లు)
కరెంటు కష్టాలు మళ్లొద్దు..
గత ప్రభుత్వాల పాలనలో కరెంట్‌తో రైతులు కష్టాలు పడ్డరు. మళ్లీ ఆ కష్టాలు పడేందుకు సిద్ధంగా లేము. రాత్రి మూడు గంటలు, పగలు మూడు గంటలు కరెంట్‌తో ఇబ్బందులు పడేవాళ్లం. రాత్రిళ్లు భయం భయంతో పొలం వద్దకు వెళ్లే వాళ్లం. కరెంట్ షాక్ వస్తుందనో ఏదైనా పురుగుబూషి కరుస్తుందనే భయం ఉండేది. మధ్య మధ్యలో కరెంట్ పోయి వచ్చేది.
– బాల్‌రెడ్డి, కంచిమోనిగూడ, మొయినాబాద్
10 హెచ్పీతో భూగర్భ జలాలు అడుగంటుతయ్..
10 హెచ్‌పీ మోటర్లు పెడితే ఊటను తొందరగా గుంజేస్తే భూగర్భ జలాలు అడుగంటుతయ్. ఐదారు ఎకరాలు సాగు చేసే రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఇప్పడిస్తున్న 24 గంటల కరెంట్ సక్రమంగా వస్తుంది. ఓ పార్టీ నాయకుల మాటలు హాస్యాస్పదం. వారికి ఎవుసంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నరు.
– మంచె పెద్ద రాములు, అజీజ్‌నగర్, మొయినాబాద్
ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతయ్..
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నిరంతర విద్యుత్‌తో సంతోషంగా ఉన్నం. బావులు, బోర్ల కింద బంగారు పంటలు పండుతున్నయ్. 10హెచ్‌పీ మోటరంటే రైతుకు తలకు మించిన భారమే. లోడు పెరిగి ట్రాన్స్ఫార్మర్లు కాలిబూడిదవుతయి. మాయదారి పార్టీ నాయకులు వ్యవసాయాన్ని కుప్పకూల్చే ప్రయత్న చేస్తున్నరు. అన్నదాతలు అంతా బాగా ఆలోచించాలి.
– కైరోజు లక్ష్మణ్, శ్రీనగర్ కాలనీ, పెద్దఅంబర్‌పేట
రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్
రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతుల పక్షపాతి కాబట్టే 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. ఆ పార్టీని నమ్ముకుంటే మళ్లీ తిప్పలు తప్పవనే చెప్పాలి. రైతులు ఆలోచించాల్సిన సమయం వచ్చింది.
– కావలి సత్యనారాయణ, దేవునిఎర్రవల్లి గ్రామం (చేవెళ్ల రూరల్)
మూడు గంటల కరెంట్‌తో మడి కూడా పారదు..
వ్యవసాయానికి మూడుగంటల కరెంట్ సరిపోతుందని ఓ పార్టీ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటు. ఒక్క మడి కూడా పారదు. కాంగ్రెస్ నమ్ముకుంటే రాత్రిపూట పంటలకు నీరు పెట్టేందుకు పొలాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తది.
– కౌకుంట్ల మధుకర్‌రెడ్డి, చర్లగూడ(షాబాద్)
మునుపటి కష్టాలు తప్పవు..
గతంలో కరెంట్ కోసం కష్టాలు పడ్డం. మళ్లీ మూడు గంటల కరెంట్ అంటే మునుపడి కష్టాలు తప్పవు. ఇప్పుడున్న 24 గంటల కరెంట్వో హాయిగా ఉన్నం. బాయిలు, బోర్లళ్ల నీళ్లు పుష్కలంగా ఉన్నయి. కొందరి నాయకుల మాటలు నమ్మలేము. బాయిలు, బోర్ల కాడ జాగారం చేయాల్సి వస్తది.
– గంగని శ్రీనివాస్, కొహెడ, తుర్కయంజాల్ మున్సిపాలిటీ
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

