ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు అరెస్ట్
రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను ఎల్బీనగర్ ఎస్ఓటీ, జవహర్‌నగర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసి.. వారి నుంచి 40 కిలోల పప్పీ స్ట్రా , 10 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.
సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను ఎల్బీనగర్ ఎస్ఓటీ, జవహర్‌నగర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసి.. వారి నుంచి 40 కిలోల పప్పీ స్ట్రా , 10 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన ఓమ్ రామ్ అలియాస్ ఓం ప్రకాశ్ వృత్తిరీత్యా కార్పెంటర్. గతంలో రాజస్థాన్‌లో డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతడి స్నేహితుడైన సానవాల రామ్ హైదారాబాద్‌లోని లింగంపల్లిలో ఉంటూ రెయిలింగ్ వర్క్ చేస్తున్నాడు. వీరిద్దరికీ డ్రగ్స్ అలవాటు ఉన్నది. కాగా, మధ్యప్రదేశ్‌కు చెందిన వికాస్ అలియాస్ ముఖేశ్‌తో పరిచయం ఏర్పడింది.
ఇద్దరు డ్రగ్స్‌కు అలవాటు పడడం, హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల గిరాకీ ఉన్నదని గుర్తించి.. ముఖేశ్ వద్ద డ్రగ్స్ కొని హైదరాబాద్‌లో విక్రయించేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా పోలీసులకు చిక్కకుండా ఉండేలా బస్సులు, లారీలు, ఆటోల్లో ప్రయాణించి హైదరాబాద్ శివారుకు చేరుకున్నారు. ఎస్ఓటీ ఎల్బీనగర్ డీసీపీ మురళీధర్ నేతృత్వంలోని బృందాలకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో జవహర్‌నగర్ పోలీసులతో కలిసి వీరిపై నిఘా పెట్టి కీసర మండలంలోని తిమ్మాయిపల్లిలో గ్రామ శివారులో ఓం ప్రకాశ్, రామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరి నుంచి 40 కిలోల పప్పీ స్ట్రా, 10 గ్రాముల ఎండీఎంఏ, రూ. 10 వేల నగదు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

