పాఠశాలల్లో శానిటైజేషన్ తప్పనిసరి
- జిల్లా పరిషత్ సీఈవో దిలీప్‌కుమార్

మొయినాబాద్ : సెప్టెంబర్ మొదటి వారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో పాఠశాలలను వంద శాతం శానిటైజేషన్ చేయాలని జిల్లా పరిషత్ సీఈవో దిలీప్‌కుమార్ అన్నారు. శనివారం మండల పరిధిలోని చిలుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ మొదటి వారం నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో ఉపాధ్యాయులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యా బోధన చేయాలని సూచించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. గ్రామంలో పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ గనుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, సర్పంచ్ గునుగుర్తి స్వరూప, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, కారోబార్ రాజేష్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు ఆండ్రూ, జయవంత్ ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

