నేర రహిత సమాజమే ధ్యేయం
ప్రజలకు భద్రత కల్పించడం తో పాటు నేర రహిత సమాజం కోసం పోలీసులు నిరంతరం కృషి చేయాలనేదే పోలీసుల ధ్యేయ మని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు.
- డ్రగ్స్ వినియోగం, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలి
- విజిబుల్ పోలీసింగ్‌ను పెంచాలి
- సివిల్ తగాదాల్లో తలదూరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు
- రాచకొండ కొత్త సీపీగా సుధీర్‌బాబు బాధ్యతల స్వీకరణ
- పోలీస్ అధికారులతో నేరేడ్మెట్లో సమీక్షా సమావేశం
సిటీబ్యూరో/ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ప్రజలకు భద్రత కల్పించడం తో పాటు నేర రహిత సమాజం కోసం పోలీసులు నిరంతరం కృషి చేయాలనేదే పోలీసుల ధ్యేయ మని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. రాచకొండ కొత్త సీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శనివారం తొలిసారిగా సీపీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించా రు.
ఈ సందర్భంగా సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ.. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధి లో నేరాలను అరికట్టేందుకు పోలీసులు మరింత కృషి చేయాలని, నేరస్తులను పట్టుకోవడంలో, నేరపరిశోధనలో సాంకేతిక ఆధారాలతో పాటు సీసీ కెమెరాలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.
అంతర్రాష్ట్ర దొంగల ము ఠాలను వెంటాడి పట్టుకోవాలని ఆదేశించారు. రాచకొండ పరిధిలోని పాత నేరస్తుల కదలికల మీద నిరంతరం నిఘా పెట్టాలన్నారు. రోజువారీ పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, వీలైనంత తక్కువ సమయంలో బాధితుల వద్దకు చేరుకోవాలని, ముఖ్యంగా విజుబుల్ పోలీసింగ్‌ను పెంచాలని ఆదేశించారు.
డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం
డ్రగ్స్ రవాణా, వినియోగం, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను సీపీ సుధీర్‌బాబు ఆదేశించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగంపై కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగం లేకుండా సూక్ష్మ నిఘా పెట్టాలని ఆదేశించారు.
డిజిటల్ యుగం లో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో జరిగిన ఈ సమావేశంలో రాచకొండ అదనపు కమిషనర్ తరుణ్‌జోషి, సైబర్‌క్రైమ్ డీసీపీ అనురాధ, యాదాద్రి డీసీపీ రాజేశ్ చంద్ర, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, మల్కాజిగిరి డీసీపీ జానకి, రోడ్ సేఫ్టీ డీసీపీ శ్రీబాల, అడ్మిన్ డీసీపీ ఇందిర, అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఏసీపీలు, ఇన్స్పెకర్లు పాల్గొన్నారు.
సివిల్ తగాదాల్లో తలదూరిస్తే చర్యలు తప్పవు
పోలీసు అధికారులు, సిబ్బంది సివిల్ తగాదాల్లో తలదూర్చవద్దని, నిర్ధిష్ట ఎస్వోపీ ప్రకారమే సివిల్ కేసుల విషయంలో నడుచుకోవాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ సుధీర్‌బాబు హెచ్చరించారు. సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులు, సిబ్బంది తమ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు కనీసం 15నిమిషాలు ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుని వారితో మమేకమవ్వాలని సూచించారు.
పోలీసులు తమ విధి నిర్వహణలో పారదర్శకంగా, నిజాయితీగా జవాబుదారితనంతో వ్యవహరించాలన్నారు. చట్టపరిధిలో, దర్యాప్తు నిబంధనలకు అనుగుణంగానే నేర పరిశోధన జరగాలని, గరిష్ట శిక్షా రేటు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, షీ టీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

