Rangareddy | ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన టీడీపీ నాయకులు

మంచాల : మంచాల మండలం ఆగపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఆదివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీడీపీ నాయకులకు పార్టీ కండువాలను కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్లో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇవ్వడమే కాకుండా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. పార్టీ కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయడమే కాకుండా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందే విధంగా చూడాలని సూచించారు.
పార్టీలో చేరిన వారిలో పండుగుల శ్రీకాంత్, వినయ్, అజయ్, సుధీర్, కొప్పు వినయ్‌లు పార్టీలో చేరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చీరాల రమేశ్, నాయకులు కావలి శ్రీనివాస్, కందాల శ్రీశైలం, మార సురేశ్, నూతన గంటి శేఖర్, పున్నం రాము, పూజారి శ్రీరాములు, ఏరేశ్ యాదవ్, లక్ష్మణ్‌గౌడ్, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ చారి పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. నవంబర్ 3 నుంచి మళ్లీ సెట్స్‌లోకి పాన్ ఇండియా స్టార్!
I’m Game OTT | ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

