తుర్కయాంజాల్ : మున్సిపాలిటీ ఉమర్ఖాన్ గూడ, సంఘీనగర్ గ్రామాల్లో శనివారం సొసైయో హాండ్స్ టూగెథెర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కౌన్సిలర్ కరాడి శ్రీలత అనిల్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్యులు అవినాశ్, వహిందే, సాయినాథ్, జయంత్, సౌజన్య, అతిఫ్, హజేరా, ఆనంద్, భవాని, మంజు, ఖానామా, మాజీ ఎంపీటీసీ ప్రమీలా కృష్ణా రెడ్డి, నాయకులు కరాడి అనిల్‌కుమార్, మనోహర్‌రెడ్డి, బండారు దానయ్య, లకా్ష్మారెడ్డి, డేరంగుల యాదయ్య, గడ్డం బాలయ్య తదితరులు పాల్గొన్నారు.