మహేశ్వర మహా పిరమిడ్తో
మహేశ్వర మహా పిరమిడ్తో ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని.. సుభాష్ పత్రీజీ కలలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిరమిడ్ ట్రస్టు చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి అన్నారు.
- పిరమిడ్ ట్రస్టు చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి
- ‘పత్రీజీ ధ్యాన మహాయాగం’ను ప్రారంభించిన పత్రీజీ కుటుంబ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు
- తరలి వచ్చిన పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు
కడ్తాల్, డిసెంబర్ 21 : మహేశ్వర మహా పిరమిడ్తో ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని.. సుభాష్ పత్రీజీ కలలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిరమిడ్ ట్రస్టు చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. మండలంలోని అన్మాస్‌పల్లి గ్రామ సమీపంలో గల కైలాసాపురి మహేశ్వర మహా పిరమిడ్‌లో గురువారం సాయంత్రం పత్రీజీ ధ్యాన మహాయాగం-2 ధ్యాన మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
పదకొండు రోజులపాటు జరుగనున్న ధ్యాన మహాయాగం సభలను పత్రీజీ కుమార్తెలు పరిమళ, పరిణీతతో కలిసి పిరమిడ్ ట్రస్టు సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ధ్యానులనుద్ధేశించి విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ సుభాష్ పత్రీజీ ధ్యాన గురువని, ఆయన చూపిన ధ్యాన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు.

అన్మాస్‌పల్లి గ్రామంలో నిర్మించిన మహా పిరమిడ్తో ఈ ప్రాంతానికి ఎంతో గుర్తింపు లభించిందని.. సుభాష్ పత్రీజీ ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించారన్నారు. సుభాష్ పత్రీజీ భౌతికంగా దూరమైన ఆయన అందించిన ధాన్యం మరవలేనిదని తెలిపారు.
ధ్యాన మహాసభలకు వివిధ ప్రాంతాల నుంచి పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు హాజరయ్యారు. పిరమిడ్ ధ్యాన సభల ప్రారంభోత్సవం సందర్భంగా కళాకారుల నృత్యాలు విశేషంగా అలరించాయి. అంతకుముందు పత్రీజీ శక్తిస్థల్‌ను ట్రస్టు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు సందర్శించారు. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్టు సభ్యులు సాంబశివరావు, దామోదర్‌రెడ్డి, రాంబాబు, హనుమంతురాజు, శివప్రసాద్, కృష్ణారెడ్డి, రాజశేఖర్, చంద్రశేఖర్, మాధవి, లక్ష్మి, జడ్పీటీసీ దశరథ్‌నాయక్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, అన్మాస్‌పల్లి సర్పంచ్ శంకర్, ధ్యానులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

