ఫార్మాసిటీ భద్రతే లక్ష్యంగా..
హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటులో భాగంగా అక్కడి పరిసర ప్రాంతాల్లో బందోబస్తును మరింతగా బలోపేతం చేయడానికి మండలంలోని మేడిపల్లిలో నూతన పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
- మేడిపల్లిలో ఫార్మా పోలీస్‌స్టేషన్
- స్థల పరిశీలన చేసిన అధికారులు
- అవుట్ పోస్టు కోసం కంటైనర్ల దిగుమతి
యాచారం, డిసెంబర్ 29 : హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటులో భాగంగా అక్కడి పరిసర ప్రాంతాల్లో బందోబస్తును మరింతగా బలోపేతం చేయడానికి మండలంలోని మేడిపల్లిలో నూతన పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికోసం ఇప్పటికే టీఎస్ఐఐసీ అధికారులు, రాచకొండ పోలీస్ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపిన విషయం తెలిసిందే. అధికారుల అభ్యర్థన మేరకు పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మేడిపల్లి మండలంలోనే మేజర్ గ్రామపంచాయతీ కావడం.. ఫార్మాసిటీకి కూతవేటు దూరంలో ఉండటం.. అసలే సమస్యాత్మక గ్రామంగా ఉండటంతో అత్యాధునిక వసతులతో రక్షకభట నిలయాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఫార్మాసిటీ పనులు ప్రారంభమైతే ముఖ్య నేతలు, ఉన్నతాధికారులు, మంత్రులు, విదేశీ బృందాలు పర్యటించే అవకాశముంది. ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు ఇక్కడే నివసించే అవకాశాలున్నందున రక్షకభట నిలయం అత్యవసరంగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాలైన ఆదిబట్ల, కందుకూరు, యాచారం ప్రాంతాల్లో ప్రముఖ పరిశ్రమలు ఉండటం.. కొంగర్‌కలాన్‌లో కలెక్టరేట్ ప్రారంభం కావడం.. ముఖ్యంగా ఫార్మాకు రక్షణ కవచంగా ఉపయోగపడనుంది. ప్రభుత్వం నుంచి నివేదికలొచ్చిన వెంటనే పోలీస్‌స్టేషన్ ఏర్పాటు పనులు జరుగనున్నాయి.
సకల సౌకర్యాలతో..
ఫార్మాసిటీ కోసం ఇప్పటికే మండలంలో కోర్టు కేసులో ఉన్న భూములను మినహాయిస్తే అసైన్డ్, పట్టా భూముల సేకరణ పూర్తయింది. అటు నాగార్జునసాగర్.. ఇటు శ్రీశైలం రహదారులను కలుపుతూ ఉన్న రోడ్డు మార్గంలో సుమారు 25 ఎకరాల్లో సకల వసతులతో నూతన ఠాణాను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం వంద ఫీట్ల డబుల్ రోడ్డును కూడా నిర్మించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నది. మూడు నెలల్లో ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు సమాచారం.
మూడు మండలాల సరిహద్దులో..
యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల సరిహద్దులో 19,339 ఎకరాల విస్తీర్ణంలో ఫార్మాసిటీ ఏర్పాటు కానుండటంతో.. ఈ మూడు మండలాల సరిహద్దు ప్రాంతమైన మేడిపల్లిలో ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్‌ను నెలకొల్పనున్నారు. గురువారం తాత్కాలికంగా అవుట్ పోస్టు కోసం రెండు కంటైనర్ బాక్సులను దిగుమతి చేశారు. సీఐ లింగయ్య ఆ స్థలాన్ని పరిశీలించారు. యాచారం మండలానికి చెందిన మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, గొల్లగూడ, కుర్మిద్ద, కుర్మిద్దతండా, కందుకూరు మండలం మీర్ఖాన్పేట, ఆకులమైలారం, మాలగూడ, మంగలిగడ్డతండా, బేగరికంచ, కడ్తాల్ మండలం పల్లెచెల్కతండాలు ఫార్మా పోలీస్‌స్టేషన్ పరిధిలోకి రానున్నట్లు సమాచారం.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

