Peddaamberpeta : మంత్రి సబితారెడ్డికి మట్టి గణపతులు అందజేత

పెద్దఅంబర్‌పేట : వినాయక చవితిని పురస్కరించుకుని అందరూ మట్టి గణపతులను పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ జరుపుకోవాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలి, జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని తన నివాసంలో సంస్థ ప్రతినిధులు కలిసి మట్టి గణపతిని అందజేశారు. మట్టి గణపతులను పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ ప్రజల ఆరోగ్యంతో పాటు భూసార పరిరక్షణ కాపాడాలనే ఉద్దేశంతో మట్టిగణపతులను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు.
ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. మంత్రి స్పందిస్తూ గాంధీ గ్లోబల్ సంస్థలు చేపట్టిన సామాజిక సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్‌రెడ్డి, మహిళా కన్వీనర్ మైనేని వాణి, దశరథగౌడ్, శివకుమార్, చెన్నయ్య, రాధిక ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

