పల్లె ప్రకృతి వనాన్ని పూర్తి చేయాలి
డీఆర్డీవో పీడీ ప్రభాకర్

కడ్తాల్ : మండలంలో చేపట్టిన బృహత్ పల్లెప్రకృతి వనం పనులను త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీవో పీడీ ప్రభాకర్ అన్నారు. మండల పరిధిలోని మైసిగండి గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లెప్రకృతి వనం పనులను ఎంపీడీవో రామకృష్ణ, ఏంపీవో తేజ్సింగ్తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా పీడీ ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లెప్రకృతి వనాన్ని సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కూలీల సంఖ్యను పెంచి పనులను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. 6 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న పల్లెప్రకృతి వనంలో 10వేల మొక్కలు నాటాలన్నారు. అదే విధంగా కడ్తాల్-తలకొండపల్లి రహదారికిరువైపులా మొక్కలను నాటాలని అధికారులకు సూచించారు. అనంతరం కడ్తాల్ మండల కేంద్రంలోని పల్లెప్రకృతి వనాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ప్లాంటేషన్ మేనేజర్ సక్కుబాయి, సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, తులసీరాంనాయక్, ఏపీవో అంజయ్య, టీఏ రవి, పంచాయతీ కార్యదర్శులు రాంచంద్రారెడ్డి, సత్యం పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

