బీఆర్ఎస్లోకి క్యూ
కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అందరూ బీఆర్ఎస్లో చేరేందుకు ఇష్టపడుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న చేరికలు..
- శుక్రవారం ఇబ్రహీంపట్నం, తాండూరు, కొడంగల్, వికారాబాద్ ఎమ్మెల్యేల సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్న ప్రతిపక్షాల నేతలు
పెద్దఅంబర్‌పేట, అక్టోబర్ 13: కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అందరూ బీఆర్ఎస్లో చేరేందుకు ఇష్టపడుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ 15వ వార్డు పరిధి మర్రిపల్లికి చెందిన కాంగ్రె స్ ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ నాయకులు పాశం దామోదర్, అనంతుల వెంకటేశ్వర్‌రెడ్డి, గౌడ సంఘం గ్రామ అధ్యక్షుడు కప్ప సత్యనారాయణగౌడ్, ఉపాధ్యక్షుడు నక్క శ్రీధర్‌గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరగా.. వారికి కిషన్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ నాయకులు నక్క బుచ్చయ్యగౌడ్, సీక కృష్ణగౌడ్, నక్క మహేందర్‌గౌడ్, గౌడ సంఘం డైరెక్టర్ నక్క అమరేందర్‌గౌడ్, నక్క పాండుగౌడ్, నక్క హనుమంతుగౌడ్, నక్క వేణుగౌడ్, సీక శంకరయ్యగౌడ్, సీక స్వామి గౌడ్, సీక దాసూగౌడ్, నక్క రాజూగౌడ్, నక్క హరిబాబు గౌడ్ తదితరులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
కుల వృత్తులకు చేయూత
ఇబ్రహీంపట్నంరూరల్ : తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ కులవృత్తిదారులకు ఆర్థిక చేయూతనిచ్చి వారు ఎదిగేలా అండగా నిలిచార ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం నుంచి వడ్డెర కుటుంబాలు, పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీ మర్పల్లికి చెందిన గౌడకులస్తులు శుక్రవారం ఎలిమినేడులోని ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారి కి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో దండుమైలారం గ్రామానికి చెందిన శంకరయ్య, యాదయ్య, మ ర్పలికి చెందిన కృష్ణారెడ్డి, సత్యనారాయణ, బుచ్చయ్యగౌడ్ ఉన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రమణారెడ్డి, సర్పంచ్ మల్లీశ్వరి, నాయకులు జంగ య్య, వెంకటేశ్వర్‌రెడ్డి, దామోదర్, జగన్నాథం, వెంకటేశ్, జగదీశ్, ఐలే శ్, జయమ్మ పాల్గొన్నారు.
దూసుకుపోతున్న కారు
తాండూరు : తాండూరు పట్టణంతో పాటు ని యోజకవర్గంలో గులాబీ పార్టీ జోరు మీదున్నది. కారు స్పీడ్‌తో దూసుకుపోతున్నది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ముమ్మర ప్రచారాలకు బీఆర్ఎస్కు ప్రజలు అ నూహ్య మద్దతు పలుకుతున్నారు. బీఆర్ఎస్కు మద్ధతుగా వివిధ కుల సంఘాల ప్రజలు, ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారు. శుక్రవారం బషీరాబాద్, తాండూరు మండలంలోని గ్రామాల నుంచి ప్రజలు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. బంగారు తెలంగాణ సాధనకు తమతో మద్దతుగా బీఆర్ఎస్లో చేరిన ప్రజలకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఘనంగా స్వాగతించారు.
ప్రతిపక్షాల మాయమాటలు నమ్మకండి
కొడంగల్ : మోసపూరిత ప్రతిపక్షాల మాయమాటలు నమ్మవద్దని, అభివృద్ధిని సాధిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆదరించి మరింత ప్రగతికి సహకరిద్దామని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలో ఎమ్మెల్యే సమక్షంలో కొడంగల్ మండలంలోని రుద్రారం, మద్దూర్ మండలంలోని భూనీడ్ గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేండ్లలో రూ.కోట్ల నిధులతో కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం సైనికుల్లా నిలిచి పార్టీ గెలుపునకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ పథకాలు దేశంలోనే ఆదర్శం
వికారాబాద్ : తెలంగాణలో అమలవుతున్న సం క్షేమ పథకాలు దే శానికే ఆదర్శమని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలో వికారాబాద్ మండలం సిద్దులూర్, మర్పల్లి మండలానికి చెందిన కాం గ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని వివరించారు. అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ మండల అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, నాయకులు నర్సింహారెడ్డి, రాజు, మర్పల్లి జడ్పీటీసీ మధుకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

