మాఫీ.. కథ కంచికేనా..?
ఏ గ్రామానికెళ్లినా మాఫీకి నోచుకోని రైతుల సమస్యలే వినిపిస్తున్నాయి. గ్రీవెన్స్‌లో వేలాది మంది రైతులు ఫిర్యాదులు చేసినా పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందిపడుతు న్నారు. ఈ పరిస్థితుల్లో బాధిత రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించి రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులను స్వీకరిస్తున్నది.
- స్పెషల్ డ్రైవ్ పేరిట రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న నోడల్ అధికారులు
- ఆ వివరాల ఎంట్రీకి ప్రత్యేక యాప్‌ను తీసుకురాని ప్రభుత్వం
- ఆప్షన్లు ఇస్తేనే..ప్రక్రియ ముందుకు సాగే అవకాశం!
- కాలయాపన చేసేందుకే అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్న రైతాంగం
- రుణమాఫీ అవుతుందా? లేదా..? అని అన్నదాతల్లో అనుమానాలెన్నో..
- ఇప్పుడు ఎక్కడ చూసినా.. రుణమాఫీ ముచ్చట్లే..
ఏ గ్రామానికెళ్లినా మాఫీకి నోచుకోని రైతుల సమస్యలే వినిపిస్తున్నాయి. గ్రీవెన్స్‌లో వేలాది మంది రైతులు ఫిర్యాదులు చేసినా పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందిపడుతు న్నారు. ఈ పరిస్థితుల్లో బాధిత రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించి రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులను స్వీకరిస్తున్నది. మాన్యువల్‌గా స్వీకరిస్తున్న అప్లికేషన్ల వివరాలను ఎంట్రీ చేసేందుకు ప్రభుత్వం యాప్‌ను మాత్రం అందుబాటులోకి తీసుకురాలేదు. యా ప్ వచ్చేది ఎప్పుడు?..వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి పంపేది ఎప్పుడు? మాఫీ అయ్యేది ఎప్పుడో..? అంటూ రైతాం గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మాఫీ..కథ కంచికి చేర్చేందు కే ప్రభుత్వం ఇలా..కాలయాపన చేస్తున్నదని విమర్శలు న్నాయి.
-రంగారెడ్డి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో మొదటి విడతలో 49,471 మందికి రూ. 257.19 కోట్లు, రెండోవిడతలో 22,915 మందికి రూ.218.13 కోట్లు, మూడోవిడతలో 15,226 మం దికి రూ.185.40 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నది. మూడు విడతల్లో కలిపి జి ల్లాలో 87,612 మందిరైతులకు రూ.660.72 కోట్ల ను మాఫీ చేసింది. అర్హులు లక్షల్లో ఉండగా.. వేలల్లోనే రుణమాఫీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొన్నది.
రేషన్ కార్డులేక కుటుంబ నిర్ధారణ కాకపోవడం, పట్టాపాస్ బుక్ లేకపోవడం, ఆధార్‌కార్డుకు లోన్ ఖాతాకు పేరులో తేడా ఉండడం, సొసైటీలు, బ్యాంకుల్లో జరిగిన తప్పులతో వేలాది మంది రుణమాఫీకి దూరమయ్యారు. మూడో జాబితాపై ఆశలు పెట్టుకున్న వారిపైనా ప్రభుత్వం నీళ్లు చల్లింది. ప్రభుత్వం ప్రకటించిన అన్ని అర్హతలు ఉన్న వారిలో చాలామందికి రుణమా ఫీ కాలేదు. తెల్లరేషన్ కార్డు ఉన్నా.. కుటుంబంలో ఒక్కరే రుణం తీసుకున్నా..పట్టాపాస్ పుస్తకం ఉన్నా..
ఆధార్‌కార్డు, బ్యాంకు బుక్‌లో ఎలాంటి పొరపాట్లు లేకున్నా రూ.2 లక్షల్లోపు రుణమాఫీ వర్తించలేదు. సర్కారు ప్రకటించిన మూడు విడతల్లోనూ మాఫీకాని అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. జిల్లాలోని 27 మండలాలకు వ్యవసాయ అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించింది. ఏవోలు లేనిచోట ఏఈవోలను నియమించారు. ఎంపిక చేసిన రైతువేదికలు, ఎంపీడీవో, తహసీల్దార్, వ్యవసాయ, మార్కెట్ కా ర్యాలయాల్లో ఈనెలాఖరు వరకు ఉదయం 10 నుం చి సాయంత్రం 5 గంటల వరకు రైతుల నుంచి వినతులను స్వీకరించనున్నారు. రుణమాఫీ ప్రక్రియను సాగదీసేందుకే..ప్రభుత్వం మళ్లీ మళ్లీ దరఖాస్తులను స్వీకరిస్తున్నదన్న అనుమానాలు అన్నదాతల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఆప్షన్లు ఇస్తేనే ప్రక్రియ ముందుకు..
రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు గతంలో ప్రభుత్వం యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. మాఫీ ఎందుకు కాలేదో చెప్పిన అధికారులు పరిష్కారం మాత్రం చూపలేకపోయారు. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఉన్నతాధికారులకు పంపించామని చేతులు దులుపుకొన్నా రు. జిల్లాలో రెండో విడతకు ముందే 16 వేల కుపైగా ఫిర్యాదులు రైతుల నుంచి అధికారులకు అందాయి. వీటిలో ఎన్నింటికి పరిష్కా రం చూపించారన్న దానిపైనా ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో మళ్లీ ప్రభుత్వం నోడల్ అధికారుల ద్వారా వినతులను స్వీకరిస్తున్నది.
కానీ.. వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక యాప్‌ను మాత్రం అం దుబాటులోకి తీసుకురాలేదు. జిల్లాలో చాలామంది రైతులు చిన్నచిన్న కారణాలతోనే మాఫీకి దూరమయ్యారు. అలాంటి రైతులకు వెంటనే పరిష్కారం చూ పే అవకాశం ఉన్నా.. ఆ దిశగా ప్రభుత్వం జిల్లాస్థా యి అధికారులకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో తమ పని దరఖాస్తుల స్వీకరణ వరకే అన్నట్లుగా.. అధికారుల ధోరణి ఉన్నది. యాప్‌ను అందుబాటులోకి తెచ్చి పరిష్కారానికి ఆప్షన్లు ఇస్తేనే..రైతుల వినతులకు పరిష్కారం లభించనున్నది. ప్రభుత్వ తీరుతో..తమకు రుణం మాఫీ అవుతుందా? లేదా? అని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఇద్దరికి ఒకే రేషన్‌కార్డు ఉన్నదని ..
నేను ఎస్బీఐలో రూ.2.40 లక్షల రుణం తీసుకున్నా. నా కుమారుడు ఆంధ్రాబ్యాంకులో రూ. లక్ష రుణం తీసుకున్నాడు. ఒకే రేషన్ కార్డు ఉన్నదన్న కారణంతో మా ఇరువురిలో ఎవరీ రుణం కూడా మాఫీ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో రైతుల ను మోసం చేస్తున్నది. అర్హులందరి రుణాలను మాఫీ చేస్తామని చెప్పి.. వివిధ కారణాలు, కొర్రీల తో పథకానికి దూరం చేస్తున్నది. సీఎం రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం అర్హులందరికీ రుణమాఫీని వర్తింపజేయాలి.
-కడారి సాయిలు, జంగారెడ్డిపల్లి ( ఆమనగల్లు మున్సిపాలిటీ)
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

