యాసంగికి బేఫికర్.. ప్రాజెక్టులు, చెరువుల్లో పుష్కలంగా నీరు
యాసంగి సీజన్లో ఆయా పంటల సాగు కు నీరందించేలా జిల్లా నీటి పారుదల శాఖ అంతా సిద్ధం చేస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ దఫా సీజన్లో రికార్డు స్థాయిలో సాగు నీరందనున్నది. జిల్లాలో చాలా వరకు వర్షాలపై ఆధారపడి సాగు చేసే పంటలే అధికంగా ఉంటాయి. ఏటా యాసంగిలో తక్కువ విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు
- యాసంగిలో 30 వేల ఎకరాలకు సాగునీరందించేలా చర్యలు
- ఈ ఏడాది భారీ వర్షాలతో నిండిన ప్రాజెక్టులు, చెరువులు
- యాసంగిలో రికార్డు స్థాయిలో పంటలకు సాగు నీరందించేందుకు నిర్ణయం
- అత్యధికంగా కోట్పల్లి ప్రాజెక్టు ద్వారా 9,200 ఎకరాలకు సాగునీరు
- లక్నాపూర్, శివసాగర్, జుంటుపల్లి ప్రాజెక్టులతోపాటు చెరువుల నుంచి సాగు నీరందించేందుకు ఏర్పాట్లు
- ప్రాజెక్టులు, చెరువుల వద్ద కాలువల మరమ్మతు పనులు
- వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 1126 చెరువులు…78,189 ఎకరాల ఆయకట్టు
వికారాబాద్, అక్టోబర్ 7, (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్లో ఆయా పంటల సాగు కు నీరందించేలా జిల్లా నీటి పారుదల శాఖ అంతా సిద్ధం చేస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ దఫా సీజన్లో రికార్డు స్థాయిలో సాగు నీరందనున్నది. జిల్లాలో చాలా వరకు వర్షాలపై ఆధారపడి సాగు చేసే పంటలే అధికంగా ఉంటాయి. ఏటా యాసంగిలో తక్కువ విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కబ్జాల పాలైన, నామరూపాల్లేకుండా పోయిన చెరువులకు మరమ్మతులు చేపట్టి పూర్వవైభవం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తదనంతరం పెద్దగా వర్షాలు లేక సాగు నీరందించే అవకాశం లేకపోయింది. గడిచిన మూడేండ్లుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులతోపాటు చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీంతో ప్రాజెక్టులు, చెరువుల కింద ఉన్న ఆయకట్టుకు సాగు నీరందించే అవకాశమున్నందున గతంలో కంటే ఈ యాసంగిలో మూడు వంతుల మేర పంటల సాగు పెరుగనున్నది. మరోవైపు ప్రాజెక్టులు, ప్రధాన చెరువుల నుంచి వెళ్లే కాలువల మరమ్మతులను ఇప్పటికే పూర్తి చేయగా, కొన్ని చెరువుల నుంచి వెళ్లే కాలువలు పూర్తిగా పాడై సాగు నీరందించే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడైతే కాలువలు బాగున్నాయో సంబంధిత ప్రాజెక్టు లేదా చెరువుల నుంచి సాగు నీరందించేందుకు జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
యాసంగిలో 30 వేల ఎకరాలకు సాగునీరు..
ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో సాగు నీరందించనున్నారు. గతంలో ఎన్నడూలేనంతగా అధిక విస్తీర్ణంలో సాగు నీరందించేందుకు సంబంధిత అధికారులు ప్లాన్ చేస్తున్నారు. జిల్లాలోని కోట్పల్లి, జుంటుపల్లి, సర్పన్పల్లి, లక్నాపూర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతోపాటు జిల్లాలోని 90 శాతానికిపైగా చెరువులు నిండి పొంగిపొర్లడంతో ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వానకాలం ప్రారంభమైన జూన్ నెలతోపాటు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో జిల్లాలోని అన్ని మండలాల్లో సాధారణానికి మించి అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఈ ఏడాది మొదట్నుంచి సరిపోను వర్షాలు కురవడంతో వరి, వేరుశనగ, శనగతోపాటు మిగతా పంటలు మంచి దిగుబడినిచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా ఒక్క కోట్పల్లి ప్రాజెక్టు నుంచి 8 వేల ఎకరాల వరకు సాగు నీరందించేవారు. మిగతా ప్రాజెక్టులు, చెరువుల నుంచి మరో 2 వేల ఎకరాలకు మాత్రమే సాగు నీటిని అందించే పరిస్థితి ఉండేది. ఈ ఏడాది యాసంగిలో మాత్రం జిల్లావ్యాప్తంగా 78,189 ఎకరాల ఆయకట్టు ఉండగా 30 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు నిర్ణయించారు. ఈసారి కోట్పల్లి ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో సంబంధిత ప్రాజెక్టు కింద ఉండే కాలువలన్నీ కొట్టుకుపోవడంతో కోట్పల్లి ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది గతంతో పోలిస్తే తక్కువ విస్తీర్ణంలో సాగు నీరందించనున్నారు. కోట్పల్లి ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది యాసంగిలో 15 వేల ఎకరాలకుపైగా సాగు నీరందించేందుకు ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ ఇంకా నీరు పారుతుండడంతో కాలువలు మరమ్మతులు చేసే అవకాశం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 1126 చెరువుల కింద 78,189 ఎకరాల ఆయకట్టు ఉండగా, 30 వేల ఎకరాలకు సాగునీరందనున్నది. కోట్పల్లి ప్రాజెక్టు నుంచి 9200 ఎకరాలకు ఈ ఏడాది సాగు నీరందించనున్నారు. శివసాగర్ ప్రాజెక్టు నుంచి 1000 ఎకరాలు, లఖ్నాపూర్ ప్రాజెక్టు నుంచి 1200 ఎకరాలు, జుంటుపల్లి ప్రాజెక్టు నుంచి 500 ఎకరాలతోపాటు ఆయా మండలాల్లోని చెరువుల నుంచి మిగతా ఎకరాలకు సాగు నీరందించేందుకు నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
సాగునీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం..
గతంలో యాసంగి సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది అధికంగా సాగు నీరందించాలని నిర్ణయించాం. ఈ ఏడాది జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు నిండిన దృష్ట్యా వీలైనంత ఎక్కువ విస్తీర్ణానికి సాగు నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కోట్పల్లి ప్రాజెక్టుకు భారీ వరద వచ్చిన దృష్ట్యా ఆ నీటి సామర్థ్యం మేరకు సాగు నీరందించనున్నాం.
– బి.సుందర్, జిల్లా నీటిపారుదల శాఖ ఈఈ
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

