మెట్రో డీపీఆర్ జాప్యం
కేంద్ర బడ్జెట్లో ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఊసేలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంతో పాటు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రెండో దశ మెట్రోను వివిధ మార్గాల్లో నిర్మించాలని ప్రతిపాదించినా, కేంద్రం మాత్రం మొండి చేయి చూపింది.
- రెండో దశకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపు శూన్యం
- డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించి ఉంటే బడ్జెట్లో నిధులు దక్కేవి
- రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం.. మరో బడ్జెట్ దాకా ఆగాల్సిందేనా?
సిటీబ్యూరో, జూలై 23(నమస్తే తెలంగాణ): కేంద్ర బడ్జెట్లో ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఊసేలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంతో పాటు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రెండో దశ మెట్రోను వివిధ మార్గాల్లో నిర్మించాలని ప్రతిపాదించినా, కేంద్రం మాత్రం మొండి చేయి చూపింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు ఎంతో కీలకమైంది.
అలాంటి ప్రాజెక్టును నగరం నలుమూలలా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచినా ఫలితం లేకుండా పోయింది. కాగా, రెండో దశ మెట్రోకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించి సకాలంలో కేంద్రానికి సమర్పించకపోవడం వల్లే ఎలాంటి నిధులు కేటాయించలేకపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డే మెట్రో ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తారని ఆశించామన్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలు గడిచినా కేంద్రం ముందు సమగ్ర ప్రాజెక్టు నివేదికను(డీపీఆర్) ఎందుకు ఉంచలేదని ఒకవైపు నగర వాసులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం..
నగరంలో మెట్రో విస్తరణ అత్యవసరమని గుర్తించిన గత కేసీఆర్ ప్రభుత్వం సుమారు 200 కి.మీ దూరం నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందులో కొన్ని మార్గాలకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం ముందుంచింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను పూర్తిగా పక్కన పెట్టి కేవలం 70 కి.మీ మేర రెండో దశ మెట్రోను నిర్మించాలని కొత్త ప్రతిపాదనలు చేసింది. దానికైనా డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రం ముందు పెట్టకపోవడంతో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మెట్రో రెండో దశకు ప్రాధాన్యత ఇవ్వలేదు. మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్యం వహించిందని బడ్జెట్ నిపుణులు పేర్కొంటున్నారు. గతేడాది డిసెంబర్ – జనవరి నెలల్లోనే రెండోదశ మెట్రో డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని ప్రకటించి ఏడు నెలలు గడిచినా, డీపీఆర్ మాత్రం ఇప్పటికీ పూర్తి చేయించలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం.
మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచి ఉంటే దానిని పరిశీలించి ఈ బడ్జెట్లో కొంతైనా కేటాయింపులు ఉండేవని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొదటి దశ మెట్రో పనులు 2021 నాటికే పూర్తయినా, అప్పటి నుంచి రెండో దశపై దృష్టి సారించినా డీపీఆర్‌ను రూపొందించడంలో మాత్రం హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ విఫలమైందని నిపుణులు పేర్కొంటున్నారు. మెట్రో రైలు అవసరమైన మార్గాలన్నీ తెలిసినా మెట్రో అధికారులు డీపీఆర్‌ను రూపొందించడంలో తీవ్ర జాప్యం చేయడం వల్లే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయింపు జరగలేదనే అభిప్రాయాన్ని బీజేపీకి చెందిన ప్రజా ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. మెట్రోకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు దక్కాలంటే వచ్చే ఏడాదిలో ప్రవేశ పెట్టే బడ్జెట్ దాకా వేచిచూడాల్సిందేనా అంటూ నగర వాసులు పెదవి విరుస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

