ఆస్వాదించే హృదయం ఉండాలే గానీ.. ప్రకృతిలోని ప్రతీ దృశ్యం అద్భుతమే.. మేఘాలను చూసి పురి విప్పి నాట్యం చేసే నెమలి..అందంగా కట్టుకున్న గూళ్లపై హొయలు పోతున్న పక్షులు.. సీతాకోకలు..మంచు బిందువుల్లో తడిసిన పూల రెక్కలు.. ఒక్కటేమిటి.. ఉమ్మడి జిల్లాలోని అటవీ ప్రాంతం నుంచి సాగిపోతుంటే కనిపించే దృశ్యాలెన్నో.. హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం.. అన్నాడో కవి.. కానీ హృదయానికి కళ్లుంటే.. ప్రతి చిత్రమూ దృశ్యకావ్యమే.