వ్యాధులపై జాగ్రత్త వహించాలి
- జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ అంజిలప్ప

చేవెళ్ల టౌన్ : పశువులకు సీజన్లో వచ్చే వ్యాధులపై జాగ్రత్తలు వహించాలని జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ అంజిలప్ప తెలిపారు. శనివారం చేవెళ్ల మండల పరిధిలోని ఊరెళ్ల, దామరిగిద్ద, కందవాడ, రావులపల్లి గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ విజయ్‌కుమార్‌రెడ్డి ఊరెళ్ల గ్రామంలో నిర్వహించిన నట్టల నివారణ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల అనారోగ్యానికి గురైన వెంటనే పశు వైద్యులను సంప్రదించాలని తెలిపారు. పశువులకు ప్రభుత్వం ఉచితంగా నట్టల నివారణ మందులు వేయిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు భూషణం, ఉప సర్పంచ్ విఠలయ్య, రైతులు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hardeep Puri | ఎప్స్టీన్తో హర్దీప్ రహస్య సమావేశం..! ఫొటోలు బయటకు రావడంతో రాజకీయ దుమారం
Liquor Sales | నీళ్లు నిల్.. మద్యం ఫుల్..! దసరాకు పల్లెల్లో పారిన మద్యపుటేరులు
Elections | రాష్ర్టాలు ఒప్పుకొంటే 2029లో జమిలి ఎన్నికలు..! : జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి
Irrigation Crisis | ఇది కాంగ్రెస్ సర్కార్ లిఫ్ట్ ఇరిగేషన్..|
India vs New Zealand | ఇక న్యూజిలాండ్ సవాల్.. నేటి నుంచే టీ20 సిరీస్ మొదలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

