అవిశ్వాసం వైపు అడుగులు..
మున్సిపాలిటీలో అవిశ్వాసం వేడి మళ్లీ రాజుకుంటున్నది. పాలకవర్గం ఏర్పడి నాలుగేండ్లు పూర్తి చేసుకున్న మరుసటి రోజే అవిశ్వాసంపై చర్చకు తెరలేచింది. కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం కోసం ఓ వర్గం కౌన్సిలర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
పెద్దఅంబర్‌పేట, జనవరి 28 : మున్సిపాలిటీలో అవిశ్వాసం వేడి మళ్లీ రాజుకుంటున్నది. పాలకవర్గం ఏర్పడి నాలుగేండ్లు పూర్తి చేసుకున్న మరుసటి రోజే అవిశ్వాసంపై చర్చకు తెరలేచింది. కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం కోసం ఓ వర్గం కౌన్సిలర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలతో చైర్మన్లు, వైస్ చైర్మన్లను పక్కకు పెట్టడంతో పెద్దఅంబర్పేటలోనూ పీఠాలు దక్కించుకునేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ఆదివారం ఓ వర్గం కౌన్సిలర్లు కలిశారు. అవిశ్వాస తీర్మానం కోసం అనుమతి కోరారు. కానీ, ఇప్పుడే ఏం చెప్పలేనని, మరో రెండ్రోజులపాటు వేచి చూడాలని ఎమ్మెల్యే సూచించినట్టు సమాచారం.
గతంలోనే క్యాంపులకు పయనం
మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. నాలుగేండ్ల కిందట జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 13 సీట్లు, టీఆర్ఎస్ 8, సీపీఐ, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో సీటు గెలుచుకున్నారు. కానీ, కాంగ్రెస్‌లోని 13 మంది కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఫలితంగా కాంగ్రెస్‌లోని ఓ వర్గం మద్దతు, ఇద్దరు ఎమ్మెల్సీల ఓట్లతో బీఆర్ఎస్ కౌన్సిలర్ చెవుల స్వప్న చైర్పర్సన్ పదవిని కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో కాంగ్రెస్ కౌన్సిలర్ చామ సంపూర్ణారెడ్డి వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచే కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నాయి. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాసం కోసం గత ఏడాది జనవరిలోనే ఓ వర్గం కౌన్సిలర్లు గట్టిగా ప్రయత్నాలు చేశారు.
క్యాంపులకు సైతం తరలివెళ్లారు. చైర్పర్సన్ పదవి కోసం పండుగల జయశ్రీ, వైస్ చైర్పర్సన్ పదవి కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వరుసకు మేనల్లుడు అయిన చల్లూరి మురళీధర్‌రెడ్డి పోటీపడ్డారు. మరోవైపు, ఉన్న పదవులు చేజారిపోకుండా వైస్ చైర్పర్సన్ సంపూర్ణారెడ్డి వర్గం సైతం క్యాంపులకు తరలివెళ్లింది. కొత్త పురపాలక చట్టం ప్రకారం.. నాలుగేండ్ల వరకు అవిశ్వాసానికి అవకాశం లేకపోవడంతో ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చైర్పర్సన్ స్వప్నతోపాటు మరో బీఆర్ఎస్ కౌన్సిలర్ కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. దీంతో కాంగ్రెస్ బలం 15కు చేరింది.
ఎవరు ఎటు వైపు..
మున్సిపాలిటీలో రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. చైర్పర్సన్ స్వప్నపై ఎట్టి పరిస్థితిలోనూ అవిశ్వాసం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం కౌన్సిలర్లు పట్టుబడుతున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతు సైతం కూడగడుతున్నారు. వైస్ చైర్పర్సన్ సంపూర్ణారెడ్డిపై అవిశ్వాసం విషయానికి వచ్చేసరికి కొందరు కౌన్సిలర్లు అటు ఇటుగా ఉన్నట్టు సమాచారం. వైస్ చైర్‌పర్సన్‌పై కాకుండా కేవలం చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టాలని పలువురు కౌన్సిలర్లు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తున్నది.
వైస్ చైర్పర్సన్ జోలికి పోతే మళ్లీ కథ మొదటికే వస్తుందని, అవిశ్వాసానికి ఆస్కారం ఉండబోదనే చర్చ కూడా నడుస్తున్నది. అందుకే చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు చాలామంది సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. వైస్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసానికి సిద్ధమయితేనే.. చైర్‌పర్సన్‌పై అవిశ్వాసానికి మద్దతిస్తామని ఓ వర్గం కౌన్సిలర్లు తేల్చిచెప్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో అవిశ్వాస అంశం రెండ్రోజుల్లో ఓ కొలిక్కి రానున్నది. ఇందుకు సానుకూల పవనాలు వీస్తే రెండు వర్గాలు మళ్లీ క్యాంపు రాజకీయాలకు తెరలేపేందుకు సిద్ధమవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

