సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ఒకటి రెండ్రోజుల్లో మరో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశమున్న నేపథ్యంలో గ్రేటర్లో ఈనెల 10 వరకు వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ ముగింపు-అక్టోబర్ ప్రారంభ కాలం చేంజోవర్ పీరియడ్ కావడంతో శుక్రవారం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఫలితంగా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేసింది. అక్టోబర్ 15 తర్వాత వానలు పూర్తిగా తగ్గుముఖం పట్టి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశమున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వల్ల చలి తీవ్ర పెరుగుతుందని అధికారులు తెలిపారు.