ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం

- నాలాలభివృద్ధికి ప్రత్యేక చర్యలు
- ప్రజల సౌకర్యార్థం మెరుగైన చర్యలు
- కుత్బుల్లాపూర్ డివిజన్లో పర్యటించిన మేయర్, ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్, జూన్ 17 : వర్షాకాలంలో ముంపు ప్రాంతాల్లో నాలా పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ 131 డివిజన్లోని గణేశ్‌నగర్‌లో స్థానిక ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలా పరివాహక ప్రాంతాన్ని ఎమ్మెల్యే కేపి వివేకానంద్‌తో పాటు వివిధ శా ఖల అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. వ ర్షాకాలంలో వరద సమస్య పరిష్కారానికి నాలాలో పేరుకుపోయిన చెత్తను తొలగించి, వెడల్పు పనులకు శ్రీకారం చుట్టాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతకు సూ చించారు. నగరంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం కేసీఆర్, పురపాలక శాఖామం త్రి కేటీఆర్‌లు ప్రత్యేక దృష్టి పెట్టా రని, ఇదే క్రమంలో ప్రస్తు తం కురిసే వర్షాలకు లోతట్టు, నాలా పరివాహ క ప్రాంతాల్లో ముందస్తుగా ప్రజలకు ఎదురయ్యే పలు సమస్యలను సకాలంలో పరిష్కరించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు సాగాలని సూ చించారు. దీనికి తోటు నాలాల అభివృద్ధికి కోట్ల రూపాయాలను వెచ్చించిందని, నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా అన్నీ రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీశ్, బొడ్డు వెంకటేశ్వర్రావు, ఎస్సి శంకర్‌నాయక్, డీసీ మంగతాయారు, ఈఈ కృష్ణచైతన్య, డీఈ పాపమ్మ, మల్లారెడ్డి, సీనియర్ నాయకులు దూదిమెట్ల సోమేశ్యాదవ్, కిశోర్‌చారి, సత్తిరెడ్డి, కాలనీ అధ్యక్షుడు నర్సింహరెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

